నందమూరి బాలకృష్ణ (జననం: 1960 జూన్ 10) ఒక తెలుగు సినిమా నటుడు, నిర్మాత, శాసనసభ సభ్యుడు. బాలకృష్ణ వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడమేకాక, పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో చేయుటకు ప్రసిద్ధి. తన సినీజీవితంలో ఎన్నో తెలుగు సినిమాలు చెయ్యడం వలన తెలుగువారికి సుపరిచితుడు. ఇతను నందమూరి తారకరామారావు కుమారుడు. ప్రస్తుతం ఆయన శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం ఎం.ఎల్.ఏగా తెలుగుదేశం పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు .