నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో బత్తుల ధనుంజయ్ రావు (43), ఉప్పుతల నరసింహారావు (38) ఇరువురు బైక్‌పై డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో డ్యూటీకి వెళ్తుండగా లారీ యార్డు వద్ద దాచేపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన వెంకటేష్ (25) మోటార్ సైకిల్ పై ఎదురుగా వచ్చి బలంగా ఢీకొనడంతో ధనుంజయరావు అక్కడికక్కడే మృతి చెందగా గాయపడ్డ ఇద్దరిని చికిత్స కోసం మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో వెంకటేష్,నరసింహారావు సైతం మృతి చెందారు.