డీఎంకే (DMK) పార్టీకి చెందిన మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లుముఖ్యమంత్రి (CM) విజయ్ ఫొటోలను తమ కార్యాలయాల్లో ఉంచేందుకు నిరాకరిస్తున్నారు. తిరునెల్వేలిలో అధికారులు మేయర్ కుర్చీ వెనుక ఉన్న గోడకు సీఎం విజయ్ ఫొటోను అమర్చగా.. దానికి నిరసనగా అక్కడి డీఎంకే మేయర్ ఏకంగా తన కుర్చీని వేరే చోటికి మార్చేసి, అక్కడ స్టాలిన్ ఫొటోను ఉంచడం సంచలనంగా మారింది. ఇదే తరహా ఘర్షణ కోయంబత్తూర్ కార్పొరేషన్‌లోనూ పునరావృతమైంది. డీఎంకే ప్రజాప్రతినిధులు మాత్రం మాజీ సీఎం స్టాలిన్ ఫొటోలనే ఉంచుతామంటూ భీష్మించుకు కూర్చున్నారు.