loader

చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే పవన్ కల్యాణ్‌ను సీఎం చేయాలి…

చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లోకి వెళితే పవన్ కల్యాణ్‌‌ను ముఖ్యమంత్రిని చేయాలని మంత్రి నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు డిమాండ్ చేశారు. కాపులకు సీఎం పదవి కావాలని ఇది వారి ఎన్నో ఏళ్ల కోరిక అని గుర్తుచేశారు. ఆంధ్రా రాజకీయాల్లో కాపు సామాజికవర్గం చాలా బలమైనదని తోట త్రిమూర్తులు గుర్తు చేశారు.చంద్రబాబు కోసం పవన్ కల్యాణ్ ఎంతో త్యాగం చేశారని…అసెంబ్లీ సీట్లు తక్కువ తీసుకున్నారు అని గుర్తు చేశారు.

నేపాల్ ఎన్నికల కౌంటింగ్.. విజయం దిశగా నూతన పార్టీ

జెన్-జీ నిరసనల తరువాత గురువారం (మార్చ్ 5) తొలిసారిగా నేపాల్ ప్రతినిధుల సభకు ఎన్నికలు జరిగాయి. నేడు జరుగుతున్న ఓట్ల కౌంటింగ్‌లో నూతన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీకి (ఆర్‌ఎస్‌పీ) విజయం దాదాపుగా ఖరారైనట్టు అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మాజీ సింగర్ బాలేంద్ర షా నేతృత్వంలోని ఆర్‌ఎస్‌పీ 165 స్థానాలకు గాను 94 సీట్లల్లో ముందు వరుసలో ఉంది. ఇక నేపాలీ కాంగ్రెస్ ఒక సీటులో విజయం సాధించగా పది స్థానాల్లో లీడ్‌లో ఉంది. సీపీఎన్-యూఎమ్ఎల్ పార్టీ […]

ఘాట్ రోడ్డు దిగుతుండగా ఘోరం.. బస్సు బ్రేకులు ఫెయిల్.. ఐదుగురు మృతి, 20మందికి సీరియస్!

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు జార్ఖండ్‌లోని సిమ్‌దేగా జిల్లాలోని కుర్దేగ్ నుండి ఛత్తీస్‌గఢ్‌లోని కుంకురికి వెళ్తూ  ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కుర్దేగ్ అవుట్‌పోస్ట్ ప్రాంతంలోని గోడాంబా గ్రామం సమీపంలోని రహదారిలో దిగువకు వస్తుంది. ఇంతలో బస్సు బ్రేకులు అకస్మాత్తుగా ఫెయిల్ అయ్యాయి. తరువాత బస్సు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిలో దాదాపు ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు.. !

ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో చర్చల ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. లొంగిపోవడం తప్ప ఇరాన్‌కు వేరే మార్గం లేదన్నారు. లొంగిపోయిన తరువాత ఇరాన్‌తో చర్చల విషయం ఆలోచిస్తామని ట్రంప్‌ స్పష్టం చేశారు. ఇరాన్‌లో కొత్త నాయకత్వం తీసుకొస్తామని, నాయకత్వాన్ని మార్చిన తరువాత ఇరాన్‌ను సమర్ధవంతమైన దేశంగా మారుస్తామని ప్రకటించారు. ఇరాన్‌ భవిష్యత్‌ చాలా బాగుంటుందని, ఆదేశ గౌరవాన్ని తిరిగి కాపాడుతామని ట్రంప్‌ అన్నారు.

పెట్రోల్ బంకుల్లో క్యూలైన్లు.. ఇంధన కొరతా ??

ఇంధన ధరలు భారీగా పెరగవచ్చని,సరఫరా పూర్తిగా నిలిచిపోవచ్చనే తప్పుడు ప్రచారాలను నమ్మి తెలంగాణలోని హైదరాబాద్ లో,మహారాష్ట్రలోనూ పెట్రోల్ బంకుల వద్ద జనం భారీగా క్యూలో నిలబడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజలు తమ వాహనాల్లో ఇంధనాన్ని నింపుకునేందుకు పోటీ పడుతున్నారు. ఈ గందరగోళంపై పెట్రోలు డీలర్ల సంఘాలు, ప్రభుత్వ యంత్రాంగం స్పందించాయి. దేశంలో ప్రస్తుతం ఎటువంటి ఇంధన కొరత లేదని, సరఫరా వ్యవస్థ సాధారణంగా కొనసాగుతోందని వారు స్పష్టం చేశారు.

కర్ణుడిలా నేనూ మిత్రధర్మానికి కట్టుబడి మాదిగల వెంట నిలబడ్డాను: సీఎం రేవంత్ రెడ్డి

మాదిగల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, మాదిగ ఉద్యోగుల సమన్వయ కమిటీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. మద్దతిస్తూ అండగా నిలిస్తే మరింత ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. నాకు మహాభారతంలో కర్ణుడు, బార్బరికుడు పాత్రలు ఇష్టం. కర్ణుడిలా నేనూ మిత్రధర్మానికి కట్టుబడి మాదిగల వెంట నిలబడ్డాను. నేను కూడా బార్బరికుడిలా బలహీనులైన మాదిగల కోసం కొట్లాడా. మాదిగ, మాదిగ ఉపకులాల హక్కులకు చట్టబద్ధత కల్పిస్తానని రేవంత్‌ రెడ్డి తెలిపారు.

గచ్చిబౌలిలో పేలిన హీలియం గ్యాస్ బెలూన్

నగరంలోని గచ్చిబౌలిలో ప్రమాదం చోటు చేసుకుంది. హీలియం గ్యాస్ బెలూన్ పేలి నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ ప్రాంగణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

అమెరికా H-1B వీసా రిజిస్ట్రేషన్లు ప్రారంభం

విదేశీ ఐటీ నిపుణులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అమెరికా H-1B వీసా ప్రక్రియ మొదలైంది. 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిజిస్ట్రేషన్లను USCIS ప్రారంభించింది. ఈ వీసా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మార్చి 19 వరకు కొనసాగనుంది. సాధారణ లాటరీ విధానంలో మార్పులు చేస్తూ, ఈసారి ‘వెయిటెడ్ సెలక్షన్’ పద్ధతిని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం, ఎక్కువ జీతం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత లభిస్తుంది,అత్యున్నత నైపుణ్యం కలిగిన నిపుణులకు ఎంపికలో వెయిటేజీ ఉంటుంది. దీనివల్ల ప్రతిభావంతులకు అమెరికాలో ఉద్యోగ అవకాశాలు […]

ఏఐ ఎఫెక్ట్..ఒరాకిల్‌లో వేలాది మందికి లేఆఫ్‌లు!

ప్రముఖ అంతర్జాతీయ టెక్ సంస్థ ఒరాకిల్ (Oracle) తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. మొత్తం 30 వేల ఉద్యోగుల‌ను తొల‌గించే ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవానికి అనుగుణంగా సంస్థలో సమూల మార్పులు చేసేందుకు యాజమాన్యం ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా వేలాది మంది ఉద్యోగులను తొలగించే (Layoffs) దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. కంపెనీ చరిత్రలోనే ఇది అత్యంత భారీ పునర్వ్యవస్థీకరణ కావచ్చని టెక్ నిపుణులు […]

సివిల్స్ ఫలితాలు విడుదల.. సత్తా చాటిన తెలుగు అభ్యర్థులు

సివిల్స్ పరీక్షల్లో తెలుగు రాష్ట్రాల్లోని అభ్యర్థులు సత్తా చాటారు. సృజన (55వ ర్యాంక్‌), డీఎస్‌కే ప్రచేత్‌ (193వ ర్యాంక్‌), ఎస్. వర్షిత్‌రెడ్డి (259‌), ఎం.పవన్‌కుమార్‌రెడ్డి (297), వి. విక్రమసింహారెడ్డి (541), గుమ్మల శ్వేత (573), పోతుపురెడ్డి భార్గవ్‌ (537), పుడారి రాహుల్‌ (748), కత్తిమాని అనిరుధ్‌ (786), కోరపాతుల శ్రీకర్‌రాజు (806), ఇస్లావత్‌ శ్రీరామ్‌ హర్ష (823), కట్టా ప్రత్యూష (908వ ర్యాంక్‌), గోగుల రాజశేఖర్‌ (920వ ర్యాంక్), గుగులోతు జితేందర్‌ నాయక్‌ (939వ ర్యాంక్) సాధించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON