loader

 దంచి కొట్టిన కూపర్.. గుజరాత్‌పై పంజాబ్ ఉత్కంఠ విజయం..

ఐపీఎల్ నాలుగో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. మంగళవారం ముల్లన్‌పూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగా, పంజాబ్ 19.1 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది. తన తొలి మ్యాచ్ ఆడుతున్న ఆస్ట్రేలియా ఆటగాడు కూపర్ కానలీ, పంజాబ్‌పై అర్ధ సెంచరీ సాధించాడు.

మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆపిల్ సంస్థల్ని బూడిద చేస్తాం: అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్..

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్నాయి.తాజాగా అమెరికాకు ఇరాన్ సంచలన వార్నింగ్ ఇచ్చింది. అమెరికాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ, పారిశ్రామిక సంస్థలపై ఏప్రిల్ 1 నుండి దాడులు చేస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్‌జీసీ) తాజాగా హెచ్చరించింది. ఇరాన్ భూభాగంపై జరిగిన దాడులకు ప్రతీకార చర్యగా ఈ నిర్ణయం ఉండనున్నట్లు ప్రభుత్వ మీడియా తెలిపింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆపిల్, ఇంటెల్, ఐబీఎం, టెస్లా, బోయింగ్ వంటి 18 దిగ్గజ కంపెనీలను ఐఆర్‌జీసీ తన లిస్టులో పేర్కొంది.

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో పొగలు.. లఖ్‌నవూలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

పశ్చిమబెంగాల్‌లోని బాగ్‌డోగ్రా నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం మంగళవారం సాయంత్రం సాంకేతిక కారణాలతో లఖ్‌నవూ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. విమానం గాలిలో ఉండగానే పొగలు రావడంతో పైలట్ ‘మేడే కాల్’ సంకేతాలు ఇచ్చారు. ఆ వెంటనే లఖ్‌నవూలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 148 మంది ప్రయాణిస్తున్నారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్టు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి తెలిపారు.

బెంగాలీలను వేధిస్తున్నారు.. బిజెపిపై విరుచుకుపడిన మమత

ఎన్నికల ప్రచార సభలో సిఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. బిజెపిపై మాటల దాడి చేశారు. బిజెపి ఒక అనాగరిక పార్టీ అంటూ ధ్వజమెత్తారు. బిజెపి.. దేశవ్యాప్తంగా బెంగాలీ మాట్లాడే వలసదారులను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో బెంగాల్ నుండి వలస వచ్చిన వారిని వేధిస్తున్నారని, వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వ్యక్తిగత అభ్యర్థులను పక్కనపెట్టి, తన నాయకత్వానికి మద్దతుగా నిలవాలని బెనర్జీ ప్రజలను కోరారు.

విద్యార్థినులపై ఎలుకల దాడి.. 11 మందికి గాయాలు..

తెలంగాణలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా పేరుగాంచిన కాకతీయ యూనివర్సిటీ ఇప్పుడు విద్యార్థినుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తే ఘటనతో వార్తల్లో నిలిచింది. రాష్ట్రంలోని రెండవ అతిపెద్ద ప్రభుత్వ యూనివర్సిటీగా గుర్తింపు పొందిన ఈ సంస్థలో ఉన్న హాస్టల్ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. సమక్క-సారలమ్మగర్ల్స్ హాస్టల్‌లో జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. రాత్రి వేళల్లో ఎలుకలు హాస్టల్ గదుల్లోకి చేరి స్వైర విహారం చేస్తూ నిద్రిస్తున్న విద్యార్థినులను కరిచిన ఘటనలో ఏకంగా 11 మంది విద్యార్థినులు ఎలుకల దాడికి గురవడం […]

మతం మారితే రిజర్వేషన్లు పోవాలా? వైఎస్ షర్మిల ఫైర్

దళిత క్రైస్తవుల రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరసన వ్యక్తం చేశారు. మతం మారినంత మాత్రాన ఒక వ్యక్తి ఎదుర్కొనే సామాజిక వివక్ష పోదని, కేవలం మతం ప్రాతిపదికన రిజర్వేషన్లను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించకపోవడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు తమ హక్కులను కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.  దళిత క్రైస్తవుల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ […]

రీల్స్ కాదు.. అన్న వరసయ్యే వ్యక్తితో ప్రేమే కారణం.. 13 ఏళ్ల బాలిక మృతి కేసులో షాకింగ్ విషయాలు

తిరుపతిలో సోమవారం సాయంత్రం చనిపోయిన బాలిక కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలిక రీల్స్ చేస్తూ భవనం పైనుంచి కిందపడి చనిపోలేదని.. బాలికది ఆత్మహత్యగా పోలీసులు గుర్తించారు. అన్న వరుస అయ్యే వ్యక్తిని బాలిక ప్రేమించిందని.. ఈ విషయం తెలిసి తల్లి మందలించటంతో మనస్తాపంతో ఐదో అంతస్తు నుంచి దూకి చనిపోయినట్లు వెల్లడించారు. రీల్స్ పిచ్చితో ప్రాణాలు పోగొట్టుకుందంటూ వార్తలు కూడా వచ్చాయి.అయితే అందరూ అనుకున్నట్లుగా బాలిక రీల్స్ చేస్తూ ప్రమాదవశాత్తూ కిందపడి చనిపోలేదని పోలీసుల […]

అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి పహిల్వాన్ భాష మాట్లాడుతుండు : హరీష్‌రావు

అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి పహిల్వాన్‌ భాష మాట్లడుతున్నడని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్‌ డొల్ల అని, అందుకే దానికి సంబంధించిన పత్రాలను చించివేశామని హరీష్‌రావు చెప్పారు. తెలంగాణ ప్రజల గొంతుకగా బీఆర్‌ఎస్‌ వ్యవహరిస్తున్నదని అన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అన్నారని, కానీ ఆ హామీలను ఈ సర్కారు నెరవేర్చలేదని విమర్శించారు. కోటి మంది మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఇస్తామని మాటతప్పారని అన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక […]

పేర్ని నానిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజం.. బఫూన్‌ అని వ్యాఖ్య

వైసీపీ సీనియర్‌ నేత,  మాజీ మంత్రి పేర్ని నానిపై ఏపీ ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్ని నానిని ఒక బఫూన్‌గా అభివర్ణించారు. అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బందరులో ఒక బఫూన్ ఉన్నాడని, షాడోలను అడ్డుపెట్టుకుని అక్రమంగా చెరువులు తవ్వించాడని, మడ అడవులను సైతం ఆక్రమించి చెరువులుగా మార్చాడని పేర్ని నానిని ఉద్దేశించి మంత్రి కొల్లు రవీంద్ర విమర్శలు చేశారు. అధికారులను బ్లాక్ మెయిల్ చేసి భూములు […]

భార్య హత్య కేసులో నాలుగేళ్లుగా పరారీలో.. ఎల్పీజీ సిలిండర్ బుకింగ్‌తో పట్టివేత

పంజాబ్‌కు చెందిన సందీప్ తోమర్ ఇండియన్ ఆర్మీలో కెప్టెన్‌గా పని చేసేవాడు.2013లో అతడు తన భార్యను హత్య చేశాడు. హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడి బెయిలు పై బయటకు వచ్చి తప్పించుకు తిరుగుతున్నాడు. సందీప్‌ను పట్టుకునేందుకు పోలీసులు నాలుగేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇటీవల ఆధార్, పాన్ ద్వారా ఒక సిలిండర్ బుక్ చేసుకుని, దానికి డబ్బులు కూడా చెల్లించాడు. దీంతో అతడు మధ్యప్రదేశ్‌లో ఉన్నట్లు అతడికి సిలిండర్ అందించిన గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి, వారి ద్వారా […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON