loader

దుబే దంచికొట్టినా.. వైజాగ్‌లో పోరాడి ఓడిన భారత్..

సిరీస్‌లోని నాల్గవ T20I మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారత్‌పై 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. బుధవారం 216 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 18.4 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. విశాఖపట్నంలో జరిగిన విజయంతో, న్యూజిలాండ్ సిరీస్‌లో 1-3 సాధించింది. శివమ్ దూబే 23 బంతుల్లో 65 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆడాడు. రింకు సింగ్ 39, సంజు సామ్సన్ 24 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్ రెండంకెల మార్కును దాటలేకపోయారు.

మున్సిపల్ ఎన్నికలు.. తొలి రోజు ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే..

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మొదటి రోజు 26 నామినేషన్లు దాఖలు అయ్యాయి. సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో తొలి రోజు(బుధవారం) 99 నామినేషన్లు దాఖలు అయ్యాయి. నిజామాబాద్​ జిల్లాలోని మూడు మున్సిపాలిటీలతో పాటు నగరపాలక సంస్థలు 22 నామినేషన్లు దాఖలు చేశారు. కామారెడ్డిలో నాలుగు మున్సిపాలిటీలకు 22 నామినేషన్లు దాఖలు అయ్యాయి.

అమెరికాలో స్థిరపడాలని కలలు కంటున్న వారికి బిగ్ షాక్..హెచ్-1బీ వీసాలకు బ్రేక్‌

గత కొంతకాలంగా అగ్రరాజ్యం అమెరికా H-1B visaపై సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర గవర్నర్‌ గ్రెగ్‌ అబాట్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని నగరాల పరిధిలో ఉన్న విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ ఏజెన్సీలు ఇకపై కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తులను వెంటనే నిలిపివేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం 2027 మే 31 వరకు అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. అమెరికన్ల ఉద్యోగ అవకాశాలను కాపాడటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ […]

ఢిల్లీలో పవన్ కల్యాణ్ బిజీ టూర్ – అమిత్ షాతో చర్చలు

ఢిల్లీ పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కీలక పెండింగ్ సమస్యలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పరిపాలనాపరమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా రాష్ట్ర భద్రత ,శాంతిభద్రతల అంశాలతో పాటు, విభజన చట్టంలోని హామీల అమలు కోసం కేంద్రం నుండి అందాల్సిన పూర్తి సహకారంపై ఆయన విన్నవించారు.  ఉప్పాడ తీర ప్రాంత కోతను అరికట్టేందుకు సీ ప్రొటెక్షన్ వాల్ ప్రాజెక్టు గురించి పవన్ […]

ఏపీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారు..

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.  ప్రభుత్వం నుంచి అసెంబ్లీ వర్గాలకు బుధవారం అధికారిక సమాచారం అందింది. ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 10 గంటలకు రాష్ట్ర గవర్నర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 14వ తేదీన 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టనున్నారు. అదే రోజున వ్యవసాయ […]

అమెజాన్‌లో భారీ లేఆఫ్స్‌- 16,000 మంది ఉద్యోగులు తొలగింపు

ప్రముఖ ఈ- కామర్స్‌ సంస్థ అమెజాన్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ సంస్థకు చెందిన 16 వేల మంది ఉద్యోగులను తొలగించింది. అమెరికాలో ఉన్న ఉద్యోగులకు పరిహారం, ప్రత్యామ్నాయ ఉద్యోగ సేవలు, ఆరోగ్య బీమా ప్రయోజనాలను అందించే ముందు కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి వారికి 90 రోజుల సమయం ఇస్తామని అమెజాన్ ప్రకటించింది.  అమెజాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గాలెట్టి ఒక బ్లాగ్ పోస్ట్‌లో ప్రకటన చేశారు. దీంతో మూడు నెలల వ్యవధిలోనే 30,000 మంది […]

నాన్నా డిప్యూటీ సీఎంతో వెళ్తున్నా.. విమానం అటెండెంట్ చివరి మాటలివే

బారామతిలో బుధవారంనాడు జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో పాటు మరణించిన మరో నలుగురిలో పింకీ మాలి ఉన్నారు. విమాన అటెండెంట్‌గా ఆమె అజిత్ పవార్‌తో పాటు విమానంలో వెళ్లారు. దీనికి ఒకరోజు ముందే పింకీ మాలి తన తండ్రి శివకుమార్‌తో ఫోనులో మాట్లాడారు. ‘నాన్నా డిప్యూటీ సీఎంతో బారామతి వెళ్తున్నాను’ అని చెప్పారు. అయితే విమాన ప్రమాద దుర్ఘటనలో పింకీ కన్నుమూయడం ఆమె కుటుంబాన్ని విషాదంలో ముంచెత్తింది.

అద్దె కట్టక‌పోవ‌డంతో తుంగతుర్తి ఆరోగ్య ఉప కేంద్రానికి తాళం

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గ‌ల‌ ఆరోగ్య ఉప కేంద్రం అద్దె గత రెండు సంవత్సరాల నుండి కట్టకపోవడంతో సబ్ సెంటర్‌కు ఇంటి యజమాని తాళం వేసిన సంఘటన బుధవారం వెలుగుచూసింది. సబ్ సెంటర్ ఆరోగ్య సిబ్బంది మాట్లాడుతూ.. కాలనీలో సబ్ సెంటర్ ప్రారంభించినప్పుడు సంబంధిత స్థానిక డాక్టర్లు అద్దె చెల్లిద్దామని చెప్పారని, నెలకు రూ.2 వేల కిరాయి చొప్పున రెండు సంవత్సరాలు రూ.48 వేలు చెల్లించాలన్నారు.

హైదరాబాద్‌ శివారులో స్కూల్‌ బస్సు బోల్తా.. పలువురు విద్యార్థులకు గాయాలు

మొయినాబాద్‌ మృగవాణి పార్క్‌ సమీపంలో స్కూల్‌ బస్సు బోల్తా పడిన ఘటన బుధవారం తీవ్ర కలకలం రేపింది. బండ్లగూడలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌కు చెందిన బస్సు హైదరాబాద్‌ వైపు వస్తున్న సమయంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’- ఎన్‌సీసీ ర్యాలీలో ప్రధాని మోదీ

దిల్లీ కంటోన్మెంట్‌లో జరిగిన వార్షిక నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ప్రధాని ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు. “ఎన్‌సీసీ అనేది యువతకు ఒక గొప్ప వేదిక. ఇక్కడ మన వారసత్వం గర్వంగా జీవిస్తుంది. భారతదేశం, ఐరోపా సమాఖ్య మధ్య కుదిరిన చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా ప్రశంసలు అందుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇది మన దేశ యువత భవిష్యత్తును మార్చేసే ‘గేమ్ ఛేంజర్’ అని స్పష్టం చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON