ప్రముఖ ఈ- కామర్స్ సంస్థ అమెజాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ సంస్థకు చెందిన 16 వేల మంది ఉద్యోగులను తొలగించింది. అమెరికాలో ఉన్న ఉద్యోగులకు పరిహారం, ప్రత్యామ్నాయ ఉద్యోగ సేవలు, ఆరోగ్య బీమా ప్రయోజనాలను అందించే ముందు కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి వారికి 90 రోజుల సమయం ఇస్తామని అమెజాన్ ప్రకటించింది. అమెజాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గాలెట్టి ఒక బ్లాగ్ పోస్ట్‌లో ప్రకటన చేశారు. దీంతో మూడు నెలల వ్యవధిలోనే 30,000 మంది ఉద్యోగులకు అమెజాన్ ఉద్వాసన పలికింది.

