లెన్స్‌కార్ట్ కంటిఅద్దాల షాపులో డ్రెస్ కోడ్ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. లెన్స్‌కార్ట్‌లో పనిచేస్తున్న హిందువులు బొట్టు కానీ, బిందీ కానీ పెట్టుకోవద్దు అని,ముస్లింలు మాత్రం హిజాబ్ ధరించవచ్చు అని డ్రెస్‌కోడ్ రిలీజ్ చేశారు. లెన్స్‌కార్ట్ వైఖరిని ఖండిస్తూ బీజేపీ నేత నజియా ఇలాహి ఖాన్.. ముంబైలోని ఓ లెన్స్‌కార్ట్ స్టోర్‌కు వెళ్లి అక్కడి ఫ్లోర్ మేనేజర్ మోషిన్ ఖాన్‌తో వాగ్వాదానికి దిగింది. ఇది హిందూ దేశం, ఓనర్ క్షమాపణలు చెప్పకపోతే లెన్స్కార్ట్ను బహిష్కరిస్తామని ఆమె అన్నారు

