loader

ఆర్నెళ్ల‌లో గోర్కా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తాం: బెంగాల్‌లో అమిత్ షా

ఒక‌వేళ ప‌శ్చిమ బెంగాల్‌లో త‌మ పార్టీ అధికారంలోకి వ‌స్తే, ద‌శాబ్ధాల కాలం నాటి గుర్కా స‌మ‌స్య‌ను ఆరు నెల‌ల్లో ప‌రిష్క‌రిస్తామ‌ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. బీజేపీ ఒక్క‌టే గోర్కా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌గ‌ల‌ద‌ని, మ‌రే పార్టీ కూడా ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌లేద‌న్నారు. డార్జిలింగ్ జిల్లాలోని కుర్సియాంగ్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల స‌భ‌లో మంత్రి షా మాట్లాడారు. గోర్కాల మ‌నోభావాల‌ను, ఆందోళ‌న‌ల‌ను బీజేపీ మాత్ర‌మే అర్థం చేసుకోగ‌ల‌ద‌ని, వారికి త‌గిన‌ట్లే ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌గ‌ల‌మ‌ని అమిత్ షా […]

లంచం తీసుకుంటూ.. ఏసీబీ వలలో ఆర్డీవో

నారాయణపేట ఆర్డీవో కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తి నుంచి 25వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఆర్డీవో రాంచంద్ర నాయక్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆర్డీవో కార్యాలయంలో ఏసీబీ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. రాంచంద్రనాయక్‌ ఈ ఏడాది అక్టోబర్‌ రిటైర్‌మెంట్‌ కావాల్సి ఉంది.

సింగపూర్​లో మంత్రుల పర్యటన – మౌలిక సదుపాయాల అభివృద్ధిపై అధ్యయనం

మొదటి రోజు సింగపూర్​లో పర్యటిస్తున్న రాష్ట్ర మంత్రుల బృందం ఆ దేశ విదేశీ వ్యవహారాలు, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి గన్ సియో హువాంగ్​తో భేటీ అయ్యారు. సమావేశంలో రాష్ట్ర మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, అనిత, అచ్చెన్నాయుడు, సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్​తో పాటు భారత హై కమిషనర్ పాల్గొన్నారు. భారతదేశం – సింగపూర్ మధ్య ఉన్న చిరకాల స్నేహ సంబంధాలు, ఆర్థిక భాగస్వామ్యం, పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరు దేశాల […]

పిఠాపురంలో హై టెన్షన్: టీడీపీ నేత వర్మపై దూసుకెళ్లిన జనసేన నేత పెండెం దొరబాబు…

ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురంలో ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు ఫోటో లేకపోవడంతో మెుదలైన గొడవ ఏకంగా బాహాబాహికి దిగేంతగా జరిగింది. ఎస్‌వీఎస్ఎన్ వర్మపై జనసేన నేత పెండెం దొరబాబు దూసుకెళ్లడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పిచ్చి పిచ్చివేషాలు వేయోద్దు అంటూ పెండెం దొరబాబు మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్ఎన్ వర్మపై దూసుకెళ్లడంతో పెద్ద తోపులాటే జరిగింది. అయితే ఇరువురుని చెదరగొట్టిన ఇతర నాయకులు వివాదం మరింత […]

ప్రపంచంలోని అత్యంత వేడి నగరాల్లో ఒకటిగా ఆదిలాబాద్‌

తెలంగాణలో ఎండల తీవ్రత మరింత అధికంగా ఉన్నది. ఆదిలాబాద్ పట్టణం ప్రపంచంలోనే అత్యంత వేడి నగరాల్లో ఒకటిగా నిలిచింది. అమెరికాకు చెందిన ప్రముఖ వాతావరణ సంస్థ ‘ఎల్డోరాడో వెదర్’ తాజాగా ప్రపంచంలోని 100 అత్యంత వేడి నగరాల జాబితాను రూపొందించింది. ఆ జాబితాలో ఆదిలాబాద్ 14వ స్థానంలో నిలిచింది. సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాలలో 43.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఎల్డోరాడో వెదర్ జాబితాలో మహారాష్ట్రలోని అకోలా 45 డిగ్రీలతో అగ్రస్థానంలో ఉంది.

అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి ముంబైకు షిఫ్ట్ అవుతున్నారా? క్లారిటీ ఇచ్చిన అల్లు అరవింద్

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హైదరాబాద్ విడిచి పెట్టనున్నాడని, తన కుటుంబంతో కలిసి ముంబైలో స్థిరపడనున్నారని గత కొన్ని గంటలుగా నెట్టింట బాగా ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్ ముంబైకి వెళ్తున్నట్లు వచ్చిన వార్తలు నిజం కాదని అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు. అతనికి ఇక్కడే సొంత ఇల్లు ఉంది. పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారు.అలాంటప్పుడు అతను ముంబైకి ఎందుకు వెళ్తారు..? ప్రస్తుతం షూటింగ్‌ పనుల వల్ల ఎక్కువ సమయం ముంబైలో ఉంటున్నాడు.’ […]

లెన్స్‌కార్ట్ స్టోర్‌లోకి దూసుకెళ్లి.. సిబ్బందికి బొట్టు పెట్టిన బీజేపీ మ‌హిళా నేత‌..

లెన్స్‌కార్ట్‌ కంటిఅద్దాల షాపులో డ్రెస్ కోడ్ వివాదం చెల‌రేగిన విష‌యం తెలిసిందే. లెన్స్‌కార్ట్‌లో ప‌నిచేస్తున్న హిందువులు బొట్టు కానీ, బిందీ కానీ పెట్టుకోవ‌ద్దు అని,ముస్లింలు మాత్రం హిజాబ్ ధ‌రించ‌వ‌చ్చు అని డ్రెస్‌కోడ్ రిలీజ్ చేశారు. లెన్స్‌కార్ట్ వైఖ‌రిని ఖండిస్తూ బీజేపీ నేత న‌జియా ఇలాహి ఖాన్‌.. ముంబైలోని ఓ లెన్స్‌కార్ట్ స్టోర్‌కు వెళ్లి అక్క‌డి ఫ్లోర్ మేనేజ‌ర్ మోషిన్ ఖాన్‌తో వాగ్వాదానికి దిగింది. ఇది హిందూ దేశం, ఓన‌ర్ క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌క‌పోతే లెన్స్‌కార్ట్‌ను బ‌హిష్క‌రిస్తామ‌ని ఆమె అన్నారు

ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులపై కలెక్టర్‌ ఆగ్రహం

జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలం వనపర్తి గ్రామం ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులపై  జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని కుందారం, వనపర్తి, నేల పోగుల గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ క్రమంలో వనపర్తి కొనుగోలు కేంద్రంలో ఏఈఓ శ్రీనివాస్ ఒక్కరే ఉండడం,మాలీలు రాకపోవడంతో, ఇలాగైతే రైతుల నుండి సకాలంలో ధాన్యాన్ని ఎలా కొనుగోలు చేస్తాం? కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎన్ని […]

భారీ బందోబస్తు నడుమ నిరుపేదల ఇండ్ల తొలగింపు.. గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు

గుంటూరులోని మోతీలాల్‌ నగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ బందోబస్తు నడుమ నిరుపేదల ఇండ్లను అధికారులు తొలగించారు. అయితే తమకు ప్రత్యామ్నాయం చూపించకుండా ఇండ్లను ఎలా తొలగిస్తారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్న ఫలంగా పిల్లలు, వృద్ధులను తీసుకొని ఎక్కడికి వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై స్థానిక ఎమ్మెల్యే నజీర్‌ వద్దకు వెళ్లి న్యాయం చేయాలని గోడు వెళ్లబోసుకున్నారు. సాయం లేదు వెళ్లి రైలు కిందపడి చావండంటూ ఉచిత సలహా ఇచ్చారని బాధితులు […]

వచ్చారో.. అరెస్టే..! నెతన్యాహుకు హంగేరి ప్రధాని పీటర్ మాగ్యార్ స్ట్రాంగ్ వార్నింగ్

హంగేరి రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విక్టర్ ఓర్బన్ 16 ఏళ్ల సుదీర్ఘ పాలనకు చరమగీతం పాడుతూ, పీటర్ మాగ్యార్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అధికారం చేపట్టిన వెంటనే. ముఖ్యంగా, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హంగేరిలో అడుగుపెడితే ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని మాగ్యార్ స్పష్టం చేశారు. యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేక నేరాల ఆరోపణలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) ఇప్పటికే నెతన్యాహుపై అరెస్టు వారెంట్ జారీ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON