ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురంలో ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు ఫోటో లేకపోవడంతో మెుదలైన గొడవ ఏకంగా బాహాబాహికి దిగేంతగా జరిగింది. ఎస్వీఎస్ఎన్ వర్మపై జనసేన నేత పెండెం దొరబాబు దూసుకెళ్లడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పిచ్చి పిచ్చివేషాలు వేయోద్దు అంటూ పెండెం దొరబాబు మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మపై దూసుకెళ్లడంతో పెద్ద తోపులాటే జరిగింది. అయితే ఇరువురుని చెదరగొట్టిన ఇతర నాయకులు వివాదం మరింత పెద్దది కాకుండా శాంతింప జేశారు.

