సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గల ఆరోగ్య ఉప కేంద్రం అద్దె గత రెండు సంవత్సరాల నుండి కట్టకపోవడంతో సబ్ సెంటర్‌కు ఇంటి యజమాని తాళం వేసిన సంఘటన బుధవారం వెలుగుచూసింది. సబ్ సెంటర్ ఆరోగ్య సిబ్బంది మాట్లాడుతూ.. కాలనీలో సబ్ సెంటర్ ప్రారంభించినప్పుడు సంబంధిత స్థానిక డాక్టర్లు అద్దె చెల్లిద్దామని చెప్పారని, నెలకు రూ.2 వేల కిరాయి చొప్పున రెండు సంవత్సరాలు రూ.48 వేలు చెల్లించాలన్నారు.

