బారామతిలో బుధవారంనాడు జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో పాటు మరణించిన మరో నలుగురిలో పింకీ మాలి ఉన్నారు. విమాన అటెండెంట్‌గా ఆమె అజిత్ పవార్‌తో పాటు విమానంలో వెళ్లారు.
దీనికి ఒకరోజు ముందే పింకీ మాలి తన తండ్రి శివకుమార్‌తో ఫోనులో మాట్లాడారు. ‘నాన్నా డిప్యూటీ సీఎంతో బారామతి వెళ్తున్నాను’ అని చెప్పారు. అయితే విమాన ప్రమాద దుర్ఘటనలో పింకీ కన్నుమూయడం ఆమె కుటుంబాన్ని విషాదంలో ముంచెత్తింది.

