loader

ఇక పై రష్యా యూనివర్సిటీల్లో హిందీ బోధన?

భారత్‌-రష్యా దేశాలు దశాబ్దాలుగా స్నేహపూర్వక సంబంధాలకు మరింత బలాన్ని చేకూర్చే నిర్ణయం రష్యా ప్రభుత్వం తీసుకుంది. రష్యా ఫెడరేషన్‌ సైన్స్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్‌ డిప్యూటీ మంత్రి కాన్‌స్టాంటిన్ మొగిలెవ్‌స్కీ అభిప్రాయం ప్రకారం, హిందీకి ఉన్న విస్తృత వినియోగాన్ని రష్యా విద్యార్థులు తెలుసుకోవాలని కోరుతున్నారు. “మా దేశంలోని విద్యార్థులు భారతీయ సంస్కృతిని లోతుగా అర్థం చేసుకోవాలంటే, హిందీ నేర్చుకోవడం అవసరం” అని ఆయన అభిప్రాయపడ్డారు.

నేడే సంపూర్ణ చంద్ర గ్రహణం.. భారత్ సహా ఏయే దేశాల్లో

దాదాపు చాలా యేళ్ల తర్వాత మన దేశంలో సంపూర్ణ చంద్ర గ్రహణం కనిపించబోతుంది. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఆలయాలను మూసివేస్తున్నారు. మరోవైపు ఈ గ్రహణం రాత్రి 9.56 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై అర్ధరాత్రి 1.36 గంటలకు వీడనుంది. ఈ అరుదైన ఖగోళ సంఘటనను ప్రపంచ జనాభాలో సుమారు 85 శాతం మంది.. అంటే దాదాపు 700 కోట్లమంది వీక్షించగలుగుతారు. ఈ గ్రహణం ఆసియా, తూర్పు ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ప్రాంతాల్లో పూర్తిగా కనిపించనుంది.

రెండు టెర్రర్‌ గ్రూపులకు మా దేశం నుంచే నిధులు : కెనడా నివేదిక

కెనడా దేశాన్ని వేదికగా చేసుకుని ఖలిస్థానీ ఉగ్రవాదులు భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు మన దేశం అనేక సందర్భాల్లో ఆరోపించింది. ఆ ఆరోపణలను కెనడా పలు సందర్భాల్లో తోసిపుచ్చింది. ఈ క్రమంలోనే కెనడా ప్రభుత్వం ‘టెర్రర్‌ ఫైనాన్సింగ్‌’ పై తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. ‘రాజకీయ ప్రేరేపిత హింసాత్మక తీవ్రవాదం కేటగిరీలో ఉన్న హమాస్‌, హెజ్‌బొల్లా, ఖలిస్థానీ వంటి ఉగ్ర సంస్థలకు కెనడా నుంచే నిధులు సమకూరుతున్నట్లు అధికారులు గుర్తించారు.

భారత్‌ను కోల్పోయామంటూ ట్రంప్ కామెంట్స్.. కేంద్రం రియాక్షన్

ారత్‌ను కోల్పోయామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన కామెంట్స్‌పై స్పందించేందుకు భారత విదేశాంగ శాఖ నిరాకరించింది. ట్రంప్ పోస్టుపై ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ చేయలేమని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో అన్నారు అమెరికాతో బంధం భారత్‌కు ఎంతో ముఖ్యమని రణధీర్ జైస్వాల్ మరో ప్రశ్నకు బదులిచ్చారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని అన్నారు. ఉమ్మడి ప్రయోజనాలు, ప్రజాస్వామ్య విలువలు, ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలు ఉన్నాయని అన్నారు

రక్షణ శాఖ పేరు మార్పు..డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్‌- ట్రంప్ సంచలన ఉత్తర్వులు

అమెరికా రక్సణ శాఖను ఇకపై యుద్ధ విభాగంగా పిలవనున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేయనున్నారు. ఇటీవల ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ. రక్షణ విభాగం అనడం కంటే యుద్ధం విభాగం అనే పదం బలమైందని అన్నారు. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు వార్ డిపార్ట్‌మెంట్‌గానే ఉంది. ఆ యుద్ధం తర్వాత అమెరికా రక్షణ శాఖగా పేరు మార్చారు. మళ్లీ, ట్రంప్ 75 ఏళ్ల తర్వాత అదే పేరు పెడుతున్నారు.

బ్రాడ్‌కామ్‌తో కలిసి సొంత AI చిప్‌లను రూపొందించనున్న ఓపెన్‌ ఏఐ

ఓపెన్ ఏఐ తన సొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్‌ను రూపొందించడానికి బ్రాడ్‌కామ్‌తో కలిసి పని చేయబోతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఎక్కువగా NVIDIA చిప్‌లు ఆధిపత్యం చూపిస్తుండుగా NVIDIAపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని ఓపెన్ ఏఐ ప్రయత్నిస్తోంది. సింపుల్‌గా చెప్పాలంటే.. ఓపెన్ ఏఐ, ChatGPT వంటి AI మోడళ్ల కోసం అవసరమయ్యే ప్రాసెసింగ్ శక్తిని తన సొంత చిప్ ద్వారా స్వయంగా అందించాలనుకుంటోంది. తద్వారా NVIDIA వంటి పెద్ద చిప్ తయారీదారులపై ఆధారపడకుండానే AI సిస్టమ్‌లను నడిపించాలని ప్లాన్ వేసింది.

నాసాలో కొత్త నియామకం.. భారత సంతతికి చెందిన వ్యక్తికి కీలక బాధ్యతలు!

అమెరికా అంతరిక్ష సంస్థ నాసాలో కొత్త నియామకం జరిగింది. భారత సంతతికి చెందిన అమెరికన్ శాస్త్రవేత్త అమిత్ క్షత్రియకు ఒక ముఖ్యమైన బాధ్యత అప్పగించింది. అంతరిక్ష సంస్థ ఆయనను నాసా కొత్త అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. అమిత్ గత 20 సంవత్సరాలుగా నాసాతో అనుబంధం కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆ సంస్థ అగ్ర నాయకత్వంలో చేరాడు. అమిత్ నియామకం చంద్రుడు, అంగారక గ్రహాల కోసం అమెరికా ప్రణాళికలకు కొత్త ఊపునిస్తుందని నాసా తాత్కాలిక నిర్వాహకుడు సీన్ పి. […]

ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ జార్జియో అర్మానీ కన్నుమూత

లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ అర్మానీ వ్యవస్థాపకుడు, ప్రపంచ ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ జార్జియో అర్మానీ కన్నుమూశారు. గురువారం (సెప్టెంబర్ 4) తన 91 ఏళ్ల వయసులో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. ఇటలీలోని మిలన్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. అర్మానీ మరణ వార్తను ఆయన ఫ్యాషన్ హౌస్ ఇన్‌స్టాగ్రామ్‌లో అధికారికంగా ప్రకటించింది. ఫ్యాషన్ ఐకాన్ చిత్రాన్ని పంచుకుంటూ, సంస్థ ఇలా పేర్కొంది. అర్మానీ గ్రూప్ సృష్టికర్త, వ్యవస్థాపకుడు, నిరంతర ప్రేరణ శక్తి అయిన సిగ్నర్ […]

ఖరీదైన నౌక.. సముద్రంలోకి వెళ్లిన వెంటనే మునక..

టర్కీలోని జోంగుల్డాక్ తీరంలో మెడ్ యిల్మాజ్ షిప్‌యార్డ్‌లో 8.74 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ నౌకను తయారు చేశారు. మంగళవారం ఈ నౌక కొంతమంది ప్రయాణికులు, సిబ్బందితో సముద్రయానం ప్రారంభించింది. అయితే సముద్రంలోకి ప్రవేశించిన పది నిమిషాల్లోపే ఈ నౌక తిరగబడి మునిగిపోయింది. ఆ నౌకలోని వారందరూ వెంటనే నీటిలోకి దూకి ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు. నౌక మునిగిపోవడానికి గల కారణాలు పూర్తిగా బయటకు రాలేదు. ఈ ప్రమాద ఘటనలో అందరూ సురక్షితంగా బయటపడ్డారని నిర్వాహకులు […]

పీఓకేలో అటవీ విధ్వంసం: పెరుగుతున్న పర్యావరణ సంక్షోభం

పాక్ ఆక్రమిత కశ్మీర్‌ లో జరుగుతున్న విస్తృత అటవీ విధ్వంసం ఇప్పుడు తీవ్రమైన పర్యావరణ సమస్యలకు దారితీస్తోంది. టింబర్ మాఫియా, పాక్ సైన్యంలోని కొంతమంది అధికారులు, రాజకీయ పెద్దల అండతో సాగుతున్న ఈ అక్రమ దందా కారణంగా ఆ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటం, వరదలు మరింత తీవ్రతరం కావడం వంటి ప్రకృతి విపత్తులు పెరుగుతున్నాయని ఇండియన్ డిఫెన్స్ రీసెర్చ్ వింగ్‌ (ఐడీఆర్‌డబ్ల్యూ) తాజా నివేదికలో స్పష్టంచేసింది. లోయకు సంబంధించిన గూగుల్ ఎర్త్ శాటిలైట్ చిత్రాల ఒకప్పుడు పచ్చదనంతో […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON