టర్కీలోని జోంగుల్డాక్ తీరంలో మెడ్ యిల్మాజ్ షిప్‌యార్డ్‌లో 8.74 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ నౌకను తయారు చేశారు. మంగళవారం ఈ నౌక కొంతమంది ప్రయాణికులు, సిబ్బందితో సముద్రయానం ప్రారంభించింది. అయితే సముద్రంలోకి ప్రవేశించిన పది నిమిషాల్లోపే ఈ నౌక తిరగబడి మునిగిపోయింది. ఆ నౌకలోని వారందరూ వెంటనే నీటిలోకి దూకి ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు. నౌక మునిగిపోవడానికి గల కారణాలు పూర్తిగా బయటకు రాలేదు. ఈ ప్రమాద ఘటనలో అందరూ సురక్షితంగా బయటపడ్డారని నిర్వాహకులు తెలిపారు.

