ారత్‌ను కోల్పోయామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన కామెంట్స్‌పై స్పందించేందుకు భారత విదేశాంగ శాఖ నిరాకరించింది. ట్రంప్ పోస్టుపై ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ చేయలేమని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో అన్నారు అమెరికాతో బంధం భారత్‌కు ఎంతో ముఖ్యమని రణధీర్ జైస్వాల్ మరో ప్రశ్నకు బదులిచ్చారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని అన్నారు. ఉమ్మడి ప్రయోజనాలు, ప్రజాస్వామ్య విలువలు, ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలు ఉన్నాయని అన్నారు

