దాదాపు చాలా యేళ్ల తర్వాత మన దేశంలో సంపూర్ణ చంద్ర గ్రహణం కనిపించబోతుంది. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఆలయాలను మూసివేస్తున్నారు. మరోవైపు ఈ గ్రహణం రాత్రి 9.56 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై అర్ధరాత్రి 1.36 గంటలకు వీడనుంది. ఈ అరుదైన ఖగోళ సంఘటనను ప్రపంచ జనాభాలో సుమారు 85 శాతం మంది.. అంటే దాదాపు 700 కోట్లమంది వీక్షించగలుగుతారు. ఈ గ్రహణం ఆసియా, తూర్పు ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ప్రాంతాల్లో పూర్తిగా కనిపించనుంది.

