భారత్-రష్యా దేశాలు దశాబ్దాలుగా స్నేహపూర్వక సంబంధాలకు మరింత బలాన్ని చేకూర్చే నిర్ణయం రష్యా ప్రభుత్వం తీసుకుంది. రష్యా ఫెడరేషన్ సైన్స్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ డిప్యూటీ మంత్రి కాన్‌స్టాంటిన్ మొగిలెవ్‌స్కీ అభిప్రాయం ప్రకారం, హిందీకి ఉన్న విస్తృత వినియోగాన్ని రష్యా విద్యార్థులు తెలుసుకోవాలని కోరుతున్నారు. “మా దేశంలోని విద్యార్థులు భారతీయ సంస్కృతిని లోతుగా అర్థం చేసుకోవాలంటే, హిందీ నేర్చుకోవడం అవసరం” అని ఆయన అభిప్రాయపడ్డారు.

