పాక్ ఆక్రమిత కశ్మీర్ లో జరుగుతున్న విస్తృత అటవీ విధ్వంసం ఇప్పుడు తీవ్రమైన పర్యావరణ సమస్యలకు దారితీస్తోంది. టింబర్ మాఫియా, పాక్ సైన్యంలోని కొంతమంది అధికారులు, రాజకీయ పెద్దల అండతో సాగుతున్న ఈ అక్రమ దందా కారణంగా ఆ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటం, వరదలు మరింత తీవ్రతరం కావడం వంటి ప్రకృతి విపత్తులు పెరుగుతున్నాయని ఇండియన్ డిఫెన్స్ రీసెర్చ్ వింగ్ (ఐడీఆర్‌డబ్ల్యూ) తాజా నివేదికలో స్పష్టంచేసింది. లోయకు సంబంధించిన గూగుల్ ఎర్త్ శాటిలైట్ చిత్రాల ఒకప్పుడు పచ్చదనంతో నిండిన ప్రాంతాలు ఇప్పుడు నిర్జనంగా కనిపిస్తున్నాయి.

