గ్రీన్‌లాండ్ అమ్మకానికి లేదు: డెన్మార్క్
గ్రీన్‌లాండ్ తమకు కావాలంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడెరిక్సెన్ తీవ్రంగా స్పందించారు. డానిష్ రాజ్యంలోని ఏ భూభాగాన్ని స్వాధీనం చేసుకునే అధికారం అమెరికాకు లేదని ఆమె హెచ్చరించారు. తనకు అత్యంత సన్నిహిత మిత్రదేశానికి హెచ్చరికలు జారీచేయడాన్ని ట్రంప్ మానుకోవాలని ఆమె సూచించారు. తమ భూభాగం అమ్మకానికి లేదని గ్రీన్‌లాండ్ ప్రజలు ఇప్పటికే స్పష్టం చేశారని ఆమె ట్రంప్‌నకు గుర్తు చేశారు.ట్రంప్ చేసిన వ్యాఖ్యలను మోసపూరితం, అమర్యాదకరంగా గ్రీన్‌లాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడెరిక్ నీల్సెన్ […]

