అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నివాసంపై దాడి జరగడం తీవ్ర కలకలం రేపింది. సిన్సినాటిలోని జేడీ వాన్స్ నివాసంపై రాత్రిపూట ఈ దాడి జరిగింది. ఈ దాడిలో అనేక కిటికీలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన జరిగిన వెంటనే సీక్రెట్ సర్వీస్, స్థానిక పోలీసులు వేగంగా స్పందించారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు సోమవారం తెల్లవారుజామున జేడీ వాన్స్ నివాసానికి చేరుకున్నారు. ఈ దాడి ఘటనకు సంబంధించి ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు.