ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తనకు ప్రోస్టేట్ క్యాన్సర్ నిర్ధారణ అయిన విషయం వెల్లడించారు. అంతే కాకుండా అందుకు విజయవంతంగా చికిత్స పొందినట్లు తెలిపారు. క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించడం వల్ల చికిత్స సులభంగా సాగిందని వైద్యులు తెలిపారు. అధునాతన టెక్నాలజీతో చేసిన టార్గెటెడ్ థెరపీ ద్వారా కణితిని పూర్తిగా తొలగించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం పూర్తిగా స్థిరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆయన త్వరగా కోలుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

