బంగ్లాదేశ్ లో హిందువులపై వరుసగా దాడులు నేపధ్యంలో , తాజాగా మరో దారుణ ఘటన వెలుగుచూసింది. హిందూ వితంతు మహిళ (40)పై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు.. ఆమెను చెట్టుకు కట్టేసి, జుట్టు కత్తిరించారు. ఈ ఘటన సెంట్రల్ బంగ్లాదేశ్ లోని, జెనైద్ జిల్లా, కాళిగంజ్ ప్రాంతంలో జరిగింది. కొంతకాలం క్రితం షహీన్ అనే వ్యక్తి నుంచి అక్కడ కొంత స్థలంతోపాటు, రెండంతస్తుల ఇంటిని కొనుగోలు చేసింది. అప్పటినుంచి షహీన్ ఆమెను పలురకాలుగా వేధించాడు.హసన్ అనే వ్యక్తితో కలిసి వచ్చి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు.

