ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. లోక్‌భవన్‌లో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు, అధికారులు ఆయనను హుటాహుటిన తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో వైద్యులు గవర్నర్‌కు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు.ఈ మేరకు గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు

