ఉత్తర కొరియా ఊహించని షాకిచ్చింది. జపాన్ భూభాగానికి సమీపంలో బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. ఆదివారం నాడు హైపర్‌సోనిక్ క్షిపణులను ప్రయోగించినట్లుగా ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా కేసీఎన్ఏ వెల్లడించింది. యుద్ధ నిరోధకతకు సంబంధించి సైనిక కార్యాచరణ సామర్థ్యాన్ని అంచనా వేయడమే ఈ పరీక్షల ముఖ్య ఉద్దేశమని తెలిపిందిఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగంపై జపాన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇవి జపాన్ భూభాగంలో పడ్డాయని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి కోయిజుమి తెలిపారు.

