అమెరికాలోని మేరీల్యాండ్‌లో తెలుగు యువతి దారుణ హత్యకు గురైంది. హోవర్డ్ కౌంటీలోని ఎలికాట్ సిటీకి చెందిన తన మాజీ ప్రియుడు అర్జున్ శర్మ నివాసంలోనే నిఖితా రావు గొడిశాల (27) అనుమానాస్పదంగా మృతి చెంది కనిపించింది. కత్తిపోట్లతో అతని అపార్ట్‌మెంట్‌లో విగతజీవిగా పడి ఉండగా పోలీసులు కనుగొన్నారు. అయితే అంతకుముందే అమె మాజీ బాయ్‌ఫ్రెండ్ దేశం విడిచి పారిపోయాడు. దానికంటే ముందు నిఖిత కనిపించడం లేదని అతనే పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.

