అమెరికాలో డబ్బు విషయంలో గొడవ కారణంగా నికిత మాజీ ప్రియుడు అర్జున్ శర్మ ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. డిసెంబర్ 31వ తేదీన నికిత మేరీల్యాండ్ సిటీలోని అర్జున్ శర్మ ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లింది. అక్కడ డబ్బుల విషయంలో ఇద్దరికీ గొడవ జరిగింది. నికితకు తిరిగి ఇచ్చిన 3,500 డాలర్లను అర్జున్ బెదిరించి అక్రమంగా బదిలీ చేయించుకున్నాడు. తర్వాత అతి దారుణంగా కత్తితో పొడిచిపొడిచి నికితను చంపేశాడు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ఇంటర్‌పోల్ పోలీసులు అర్జున్ శర్మను తమిళనాడులో అరెస్టు చేశారు.

