ఆ ముస్లిం దేశాధినేత కోసం మోడీ ప్రోటోకాల్ బ్రేక్..! ఎయిర్ పోర్టుకెళ్లి, కౌగిలింతలతో..!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశాధినేత షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఇవాళ దాదాపు రెండు గంటల పర్యటన కోసం ఢిల్లీకి వచ్చారు. దీంతో మన ప్రధానమంత్రి మోడీ ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు నేతలు హృదయపూర్వక ఆలింగనం చేసుకున్నారు. దౌత్యపరంగా భారత్ కు కీలకమైంది. రక్షణ, వాణిజ్యం, ఇంధనం మరియు ప్రాంతీయ భద్రతలో రెండు దేశాల మధ్య సహకారం విస్తరిస్తున్న నేపథ్యంలో యూఏఈ అధ్యక్షుడి పర్యటన జరుగుతోంది.

