అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సంచలన కామెంట్స్ చేశారు. ట్రంప్ ‘ఒక నేరస్థుడు’ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇరాన్‌లో జరిగిన భారీ నిరసనలకు అమెరికా మద్దతు తెలపడంపై మండిపడ్డారు. శనివారం ప్రభుత్వ టెలివిజన్‌లో ఖమేనీ ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశంలో నెలకొన్న అశాంతికి అమెరికాయే కారణమని ఆరోపించారు. ఈ అల్లర్ల వల్ల జరిగిన ప్రాణనష్టానికి, ఆస్తి నష్టానికి గానూ మేము అమెరికా అధ్యక్షుడిని నేరస్థుడిగా పరిగణిస్తున్నాం” అని ఖమేనీ పేర్కొన్నారు.

