loader

ఏప్రిల్‌ 2026 తిరుమల దర్శనాలకు టీటీడీ షెడ్యూల్ విడుదల.. జనవరి 19 నుంచే ఆన్‌లైన్ బుకింగ్స్

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఎదురుచూస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం 2026 ఏప్రిల్ నెలకు సంబంధించి శ్రీవారి దర్శనాలు, ఆర్జిత సేవలు, వర్చువల్ సేవలు, అలాగే తిరుమల–తిరుపతిలోని వసతి గదుల బుకింగ్ షెడ్యూల్‌ను టీటీడీ అధికారికంగా ప్రకటించింది. భక్తుల సౌకర్యార్థం ఈ మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్ ద్వారానే నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఏప్రిల్‌ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లను జనవరి 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

కలుషిత నీటి మరణాలకు ప్రభుత్వానిదే బాధ్యత: రాహుల్

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కలుషిత మంచినీటితో ప్రజల మరణాలకు ప్రభుత్వ నిర్లక్షమే కారణం అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన రాహుల్ శనివారం మీడియాతో మాట్లాడారు. దేశంలోనే స్వచ్ఛమైన నగరమనే బిరుదు పొందిన నగరంలో , బిజెపి ప్రభుత్వం ప్రకటించిన ఈ మోడల్ స్మార్ట్ సిటీలో ప్రజలకు తాగేందుకు మంచినీరు కూడా లేదని ఆయన స్పందించారు. రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వ నిర్వాకంతోనే ఈ దుస్థితి నెలకొందని రాహుల్ తెలిపారు.

సికింద్రాబాద్‌ను కార్పొరేషన్ చేయండి: కిషన్ రెడ్డి

సికింద్రాబాద్‌ను మున్సిపల్ కార్పొరేషన్‌గా చేయాలని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జంట నగరాల్లో సికింద్రాబాద్ ఎన్నో సంవత్సరాలుగా అన్నింటికీ కేంద్రంగా ఉందని తెలిపారు. అటువంటి సికింద్రాబాద్ పేరు లేకుండా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించడం సరికాదని ఆయన అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. లేనిపక్షంలో బిజెపి అధ్వర్యంలో సికింద్రాబాద్ ప్రజలతో కలిసి పెద్ద […]

ఇండిగోకు 22కోట్ల 20 లక్షల రూపాయల జరిమానా- డీజీసీఏ

దేశీయ విమానయాన సంస్థ ఇండిగోకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ డీజీసీఏ 22కోట్ల 20 లక్షల రూపాయల జరిమానా విధించింది. గత డిసెంబర్‌లో భారీ సంఖ్యలో విమాన సర్వీసులు రద్దుకావడంపై దర్యాప్తు జరిపిన డీజీసీఏ ఈ చర్యలు తీసుకుంది. వందలాది విమాన సర్వీసులకు అంతరాయం నేపథ్యంలో నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయగా నివేదిక ఆధారంగా జరిమానా విధించింది. డిసెంబర్‌ మొదటి వారంలో 2 వేల 507 విమానాలు రద్దు కాగా, 18వందల సర్వీసులు ఆలస్యంగా […]

ట్రంప్ ‘ఒక క్రిమినల్’ – వేలాది మంది మరణాలకు అమెరికాయే కారణం: సుప్రీం లీడర్ ఖమేనీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సంచలన కామెంట్స్ చేశారు. ట్రంప్ ‘ఒక నేరస్థుడు’ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇరాన్‌లో జరిగిన భారీ నిరసనలకు అమెరికా మద్దతు తెలపడంపై మండిపడ్డారు. శనివారం ప్రభుత్వ టెలివిజన్‌లో ఖమేనీ ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశంలో నెలకొన్న అశాంతికి అమెరికాయే కారణమని ఆరోపించారు. ఈ అల్లర్ల వల్ల జరిగిన ప్రాణనష్టానికి, ఆస్తి నష్టానికి గానూ మేము అమెరికా అధ్యక్షుడిని నేరస్థుడిగా పరిగణిస్తున్నాం” అని  ఖమేనీ […]

ఈ ‘రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ’ గోలేంటి బ్రో..

సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా ‘రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ’ పేరుతో వస్తున్న మీమ్స్, వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సీనియర్ నటుడు రాజశేఖర్ ఒక గోళీల ఫ్యాక్టరీని నడుపుతున్నారని, ఆయన కోట్లలో సంపాదిస్తున్నారని, అందులో లక్షల్లో జీతాలు ఇచ్చే ఉద్యోగాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇటీవల యూట్యూబ్‌లో ఓ వ్యక్తి “రాజశేఖర్ గోటిల ఫ్యాక్టరీ” పేరుతో వీడియో చేశాడు.ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, గూగుల్ సెర్చ్‌లలో పెద్ద ట్రెండ్‌గా మారింది. ఇది పూర్తిగా ఫేక్ & మీమ్ ట్రెండ్ […]

రెహమాన్ వివాదాస్పద వ్యాఖ్యలు.. సెలబ్రిటీల రియాక్షన్ ఇదే..

ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్ రీసెంట్‌గా చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనానికి దారి తీశాయి. బాలీవుడ్‌లో తనకు అవకాశాలు రావడం లేదని.. అందుకు మతపరమైన అంశం కూడా కారణం అయి ఉండొచ్చు కానీ.. తాను ఆ కోణంలో ఆలోచించడం లేదంటూ రెహమాన్ రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో అన్నారు. అవి డేంజరస్ కామెంట్స్’ అని రచయిత్రి శోభా డే మండిపడ్డారు. కమ్మూనిటీ కారణంగానే ఆయనకు అవకాశాలు తగ్గుతున్నాయనే దాన్ని నేను నమ్మను’’ అని రైటర్ జావేద్ అక్తర్ […]

జిల్లాల రద్దు కుట్రపై ఉద్యమ కార్యాచరణ చేపట్టాలి : బీఆర్‌ఎస్‌ శ్రేణులకు కేటీఆర్‌ పిలుపు

ప్రజలకు పరిపాలన ఫలాలు అందకుండా జిల్లాల పునర్విభజన పేరుతో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం జిల్లాల రద్దుపై చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ( KTR ) పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. పాలమూరు, నల్గొండ జిల్లాలకు సంబంధించిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనుల్లో జరుగుతున్న ఆలస్యం, కృష్ణా జలాల వాటా వంటి కీలక అంశాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని సూచించారు.

విజయవాడ – హైదరాబాద్ హైవేపై భారీ ట్రాఫిక్.. పలుచోట్ల వాహనాల మళ్లింపులు

సంక్రాంతి పండుగ సెలవులు ముగించుకుని సొంతూళ్ల నుంచి తిరిగి హైదరాబాద్ బాట పట్టడంతో జాతీయ రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోయాయి. దాంతో ఏపీ నుంచి హైదరాబాద్‌కు వచ్చేందుకు ముఖ్యమైన నేషనల్ హైవే 65పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దాంతో పలు చోట్ల వాహనాలను ట్రాఫిక్ పోలీసులు దారి మళ్లిస్తున్నారు. ముఖ్యంగా అద్దంకి-నార్కట్‌పల్లి హైవేపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. పొందుగుల బ్రిడ్జి, దామరచర్ల, మిర్యాలగూడ వంటి ప్రాంతాల్లో వాహనాలు అత్యంత నెమ్మదిగా కదులుతున్నాయి.

రాష్ట్రంలో రోహిత్ వేముల చట్టాన్ని తీసుకువస్తాం: డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క

రాష్ట్రంలో వీలైనంత త్వరగా రోహిత్ వేముల చట్టాన్ని తీసుకువస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం ప్రజా భవన్‌లో జస్టిస్ ఫర్ రోహిత్ వేముల క్యాంపెయిన్ కమిటీ సభ్యులతో డిప్యూటీ సీఎం సమావేశమయ్యారు. కర్ణాటక రాష్ట్రంలో రోహిత్ వేముల చట్టం కోసం క్యాంపెయిన్ కమిటీ రూపొందించిన ముసాయిదాను కమిటీ సభ్యులు డిప్యూటీ సీఎంకు అందచేశారు. రోహిత్ వేముల కేసును పారదర్శకంగా విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON