రాష్ట్రంలో వీలైనంత త్వరగా రోహిత్ వేముల చట్టాన్ని తీసుకువస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం ప్రజా భవన్లో జస్టిస్ ఫర్ రోహిత్ వేముల క్యాంపెయిన్ కమిటీ సభ్యులతో డిప్యూటీ సీఎం సమావేశమయ్యారు.
కర్ణాటక రాష్ట్రంలో రోహిత్ వేముల చట్టం కోసం క్యాంపెయిన్ కమిటీ రూపొందించిన ముసాయిదాను కమిటీ సభ్యులు డిప్యూటీ సీఎంకు అందచేశారు. రోహిత్ వేముల కేసును పారదర్శకంగా విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరారు.

