సంక్రాంతి పండుగ సెలవులు ముగించుకుని సొంతూళ్ల నుంచి తిరిగి హైదరాబాద్ బాట పట్టడంతో జాతీయ రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోయాయి. దాంతో ఏపీ నుంచి హైదరాబాద్కు వచ్చేందుకు ముఖ్యమైన నేషనల్ హైవే 65పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దాంతో పలు చోట్ల వాహనాలను ట్రాఫిక్ పోలీసులు దారి మళ్లిస్తున్నారు. ముఖ్యంగా అద్దంకి-నార్కట్పల్లి హైవేపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. పొందుగుల బ్రిడ్జి, దామరచర్ల, మిర్యాలగూడ వంటి ప్రాంతాల్లో వాహనాలు అత్యంత నెమ్మదిగా కదులుతున్నాయి.

