అమెరికాలోని నార్తర్న్ వర్జీనియాలో డ్రగ్స్ అమ్ముతూ, వ్యభిచార ముఠా నిర్వహిస్తున్న భారతీయ సంతతి జంటను అరెస్టు చేశారు. తమ స్వంత హోటల్లో ఈ కార్యకలాపాలకు పాల్పడినట్లు కోర్టు డాక్యుమెంట్లలో పేర్కొన్నారు. ఈ కేసులో కోశా శర్మ, ఆమె భర్త తరుణ్ శర్మపై అభియోగాలు నమోదు చేశారు. 2023 మే నుంచి రెడ్ కార్పెట్ ఇన్ను శర్మ దంపతులు లీజ్‌కు తీసుకుని నడిపినట్లు తెలుస్తోంది. డ్రగ్ సేల్స్, వ్యభిచార ముఠా ద్వారా వచ్చిన లాభాల్లో వాటా తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

