ఇరాన్ పాలకులకు వ్యతిరేకంగా గళమెత్తిన వేల మంది ఇరాన్ ప్రజలు ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమను మోసం చేశారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్లో ప్రభుత్వ మార్పుపై గంపెడాశ పెట్టుకున్న వారు ట్రంప్ తాజా ప్రకటనతో తాము నిస్సహాయులుగా మిగిలిపోయామని ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు ట్రంప్ నుంచి ఊహించని ప్రకటన రావడంతో వారంతా హతాశులైపోయారు. నిరసనకారులపై ప్రతీకారం తీర్చుకోబోమని తనకు ఇరాన్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని ట్రంప్ చెప్పుకొచ్చారు.

