loader

ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగుస్తుందా.. అబుదాబిలో కొనసాగుతున్న శాంతి చర్చలు

దాదాపు నాలుగేళ్ల క్రితం మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధానికి ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా వివిధ దేశాధినేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మరోసారి ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. అబుదాబిలో రెండు దేశాల ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. అమెరికా ఒత్తిడి మేరకు ఉక్రెయిన్ ఈ శాంతి చర్చలకు అంగీకరించింది. యుద్ధానికి ముగింపు పలకడం రష్యా చేతిలోనే ఉందన్నాడు. ఎందుకంటే మొదలుపెట్టింది రష్యానే […]

ట్రంప్ చేతిపై ఆ గాయాలేంటి? అమెరికా అధ్యక్షుడి ఆరోగ్యంపై మళ్లీ ఆందోళనలు!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో ట్రంప్ ఎడమ చేతిపై గాయం కనిపించడంతో ఆయన ఆరోగ్యంపై అనుమానాలు వస్తున్నాయి. దావోస్‌లో జరిగిన బోర్డ్ ఆఫ్ పీస్ కార్యక్రమంలో సంతకాలు చేసే సమయంలో టేబుల్ కార్నర్ తగడంలో అధ్యక్షుడు ట్రంప్ చేతికి గాయమైందని వెల్లడించారు. వెంటనే దెబ్బకు చికిత్స తీసుకున్నట్లుగా తెలిపారు. ట్రంప్ ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉందని వైట్ హౌస్ వైద్యుడు […]

గూగుల్ ఇంటర్న్‌షిప్‌..యువత కోసం గోల్డెన్ ఛాన్స్

ప్రపంచనేపథ్యలో టెక్ దిగ్గజంగా గుర్తింపు పొందిన గూగుల్ 2026 కోసం వివిధ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌లకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ అవకాశాలు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు పీహెచ్‌డీ విద్యార్థుల కోసం ఉన్నాయి. ఎంపికైన విద్యార్థులకు స్టైపెండ్ తో పాటు, బెంగళూరు, పూణే, హైదరాబాద్ లోని గూగుల్ ఆఫీసుల్లో ప్రత్యక్ష అనుభవం పొందే అవకాశం కూడా లభిస్తుంది. దరఖాస్తు చివరి తేది మార్చి 31, 2026 https://www.google.com/about/careers/applications/

238 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం.. గాలిలో ఉండగానే సాంకేతిక లోపం..

అజుర్ ఎయిర్‌లైన్స్ విమానం ZF-2998 థాయిలాండ్‌లోని ఫుకెట్ నుండి రష్యాలోని బర్నాల్‌కు ప్రయాణిస్తోంది. విమానం గాలిలో ఉండగానే ఫైలట్ సాంకేతిక లోపం గుర్తించాడు. దీంతో విమానాన్ని చైనాలోని లాన్‌జౌ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. విమానంలో 238 మంది ప్రయాణికులు ఉన్నారు. లాన్‌జౌ విమానాశ్రయం పశ్చిమ భాగంలో విమానం దాదాపు 45 నిమిషాల పాటు హోల్డింగ్ ప్యాటర్న్‌లో ప్రయాణించింది. విమానం అత్యవసర సేవల కోసం సురక్షితంగా ల్యాండ్ చేశారు.

ఏఐ రంగంలో భారత్ అద్భుతం .. దావోస్ వేదికగా ఐఎంఎఫ్ చీఫ్ ప్రశంసలు

డావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సందర్భంగా జరిగిన చర్చలలో ఐఎంఎఫ్ అధిపతి క్రిస్టలినా జార్జియేవా తన మునుపటి వ్యాఖ్యలను స్పష్టం చేస్తూ, భారతదేశం తన టెక్ పర్యావరణ వ్యవస్థలో వేగవంతమైన వృద్ధి మధ్య కృత్రిమ మేధస్సు రంగంలో ఒక ప్రధాన శక్తిగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు. భారత్ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రిఫార్ములు, ఐటీ-స్కిల్డ్ లేబర్ ఫోర్స్‌తో అద్భుత పురోగతి సాధించిందని ప్రశంసించారు. మోడరేటర్ వల్ల కొంత అపార్థం జరిగిందన్నారు. భారత్ ఏఐ పురోగతిపై ఐఎంఎఫ్‌కు గౌరవం […]

ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు – ట్రంప్

మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, ఇరాన్‌పై అమెరికా అనుసరిస్తున్న వ్యూహంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము నేరుగా మిలిటరీ యాక్షన్‌కు దిగబోమని చెబుతూనే, ఇరాన్ దిశగా అమెరికాకు చెందిన భారీ యుద్ధ నౌకలు, సైనిక బలగాలు కదులుతున్నాయని ఆయన వెల్లడించారు. “ఇరాన్ వైపు పెద్ద ఎత్తున యుద్ధ నౌకలు, భారీ ఫోర్స్ వెళ్తున్నాయి.. అక్కడ ఏం జరుగుతుందో వేచి చూద్దాం” అంటూ ఆయన చేసిన హెచ్చరికలు అంతర్జాతీయ స్థాయిలో ఉత్కంఠను రేపుతున్నాయి.

అమెరికా వలసల శాఖ అధికారుల అదుపులో 5 ఏళ్ల చిన్నారి.. దేశవ్యాప్తంగా కలకలం

అమెరికా వలసల శాఖ అధికారుల తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. మిన్నెసొటాలో మంగళవారం అక్రమ వలసదారుడు ఏడ్రియన్ అలెగ్జాండర్ ఆరియాస్‌తో పాటు అతడి ఐదేళ్ల తనయుడు లియమ్‌ను కూడా ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదంతంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కూడా మండిపడ్డారు. కు

ఆస్కార్‌ నామినేషన్స్‌-2026.. ఏకంగా 16 కేటగిరిల్లో ‘సిన్నర్స్‌’..

సినీ ప్రపంచం ఎంతగానో ఎదురుచూస్తున్న 2026 ఆస్కార్ నామినేషన్లను అకాడమీ అధికారికంగా ప్రకటించింది. 2025లో విడుదలైన అత్యుత్తమ చిత్రాల మధ్య ఈసారి గట్టి పోటీ నెలకొంది. ఈ ఏడాది నామినేషన్లలో రేయాన్ కూగ్లర్ దర్శకత్వం వహించిన ‘సిన్నర్స్‌’ చిత్రం సరికొత్త చరిత్ర సృష్టించింది. ఏకంగా 16 విభాగాల్లో నామినేషన్లు దక్కించుకుని, గతంలో ‘టైటానిక్’, ‘లా లా ల్యాండ్’ పేరిట ఉన్న 14 నామినేషన్ల రికార్డును బ్రేక్ చేసింది. ‘సిన్నర్స్‌’ తర్వాత ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రం […]

మిత్రదేశాలపై ట్రంప్ టారిఫ్‌లు రద్దు..గ్రీన్‌ల్యాండ్‌పై యూటర్న్

గ్రీన్‌ల్యాండ్‌ను తమ దేశంలో విలీనం చేసుకునే విషయంలో తీవ్రంగా ప్ర‌య‌త్నించిన‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) అనూహ్యంగా వెనక్కి తగ్గారు. యూరప్ దేశాలపై విధించాలనుకున్న టారిఫ్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో నాటో కూటమిలో తలెత్తిన తీవ్ర సంక్షోభానికి తాత్కాలికంగా తెరపడినట్లయింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ… గ్రీన్‌ల్యాండ్ “హక్కు, టైటిల్, యాజమాన్యం” తమకు కావాలని, అయితే దాని కోసం సైనిక బలగాలను ఉపయోగించబోమని స్పష్టం చేశారు.

“నేనేం అడ్డుపడను”: గ్రీన్‌లాండ్ కొనుగోలుపై ట్రంప్‌నకు పుతిన్ వెరైటీ మద్దతు..

గ్రీన్‌లాండ్‌ను అమెరికా కొనుగోలు చేయాలనుకుంటే మాకేం అభ్యంతరం లేదు.. అది ఆ రెండు దేశాల మధ్య వ్యవహారం” అంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి…. “నిజానికి డెన్మార్క్ ఎప్పుడూ గ్రీన్‌లాండ్‌ను వలస ప్రాంతంగానే చూసింది. ఆ ద్వీపం పట్ల డెన్మార్క్ చాలా కఠినంగా, కొన్నిసార్లు క్రూరంగా కూడా వ్యవహరించింది. అయితే అది పాత విషయం. ఇప్పుడు దాని గురించి ఎవరూ ఆసక్తి చూపడం లేదనుకోండి” అని […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON