గ్రీన్‌లాండ్‌ను అమెరికా కొనుగోలు చేయాలనుకుంటే మాకేం అభ్యంతరం లేదు.. అది ఆ రెండు దేశాల మధ్య వ్యవహారం” అంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి…. “నిజానికి డెన్మార్క్ ఎప్పుడూ గ్రీన్‌లాండ్‌ను వలస ప్రాంతంగానే చూసింది. ఆ ద్వీపం పట్ల డెన్మార్క్ చాలా కఠినంగా, కొన్నిసార్లు క్రూరంగా కూడా వ్యవహరించింది. అయితే అది పాత విషయం. ఇప్పుడు దాని గురించి ఎవరూ ఆసక్తి చూపడం లేదనుకోండి” అని చమత్కరించారు

