గ్రీన్‌ల్యాండ్‌ను తమ దేశంలో విలీనం చేసుకునే విషయంలో తీవ్రంగా ప్రయత్నించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) అనూహ్యంగా వెనక్కి తగ్గారు. యూరప్ దేశాలపై విధించాలనుకున్న టారిఫ్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో నాటో కూటమిలో తలెత్తిన తీవ్ర సంక్షోభానికి తాత్కాలికంగా తెరపడినట్లయింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ… గ్రీన్‌ల్యాండ్ “హక్కు, టైటిల్, యాజమాన్యం” తమకు కావాలని, అయితే దాని కోసం సైనిక బలగాలను ఉపయోగించబోమని స్పష్టం చేశారు.

