అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో ట్రంప్ ఎడమ చేతిపై గాయం కనిపించడంతో ఆయన ఆరోగ్యంపై అనుమానాలు వస్తున్నాయి. దావోస్‌లో జరిగిన బోర్డ్ ఆఫ్ పీస్ కార్యక్రమంలో సంతకాలు చేసే సమయంలో టేబుల్ కార్నర్ తగడంలో అధ్యక్షుడు ట్రంప్ చేతికి గాయమైందని వెల్లడించారు. వెంటనే దెబ్బకు చికిత్స తీసుకున్నట్లుగా తెలిపారు. ట్రంప్ ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉందని వైట్ హౌస్ వైద్యుడు డాక్టర్ షాన్ బార్బబెల్లా తెలిపారు.

