అజుర్ ఎయిర్‌లైన్స్ విమానం ZF-2998 థాయిలాండ్‌లోని ఫుకెట్ నుండి రష్యాలోని బర్నాల్‌కు ప్రయాణిస్తోంది. విమానం గాలిలో ఉండగానే ఫైలట్ సాంకేతిక లోపం గుర్తించాడు. దీంతో విమానాన్ని చైనాలోని లాన్‌జౌ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. విమానంలో 238 మంది ప్రయాణికులు ఉన్నారు. లాన్‌జౌ విమానాశ్రయం పశ్చిమ భాగంలో విమానం దాదాపు 45 నిమిషాల పాటు హోల్డింగ్ ప్యాటర్న్‌లో ప్రయాణించింది. విమానం అత్యవసర సేవల కోసం సురక్షితంగా ల్యాండ్ చేశారు.

