మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, ఇరాన్‌పై అమెరికా అనుసరిస్తున్న వ్యూహంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము నేరుగా మిలిటరీ యాక్షన్‌కు దిగబోమని చెబుతూనే, ఇరాన్ దిశగా అమెరికాకు చెందిన భారీ యుద్ధ నౌకలు, సైనిక బలగాలు కదులుతున్నాయని ఆయన వెల్లడించారు. “ఇరాన్ వైపు పెద్ద ఎత్తున యుద్ధ నౌకలు, భారీ ఫోర్స్ వెళ్తున్నాయి.. అక్కడ ఏం జరుగుతుందో వేచి చూద్దాం” అంటూ ఆయన చేసిన హెచ్చరికలు అంతర్జాతీయ స్థాయిలో ఉత్కంఠను రేపుతున్నాయి.

