loader

తొలి ప్రాధాన్యం బంగ్లాదేశ్ ప్రయోజనాలకే

బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) ఛైర్మన్ తారిఖ్ రెహ్మాన్ తొలి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు. ఇప్పుడు మనమంతా స్వేచ్ఛను పొందామని, హక్కులకు అసలైన అర్థాన్ని తిరిగి సంపాదించుకున్నామని ఆయన పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యం కోసం పోరాడిన వారందరికీ ఈ విజయన్ని అంకితమిస్తున్నామని అన్నారు.కాగా, భారత్, చైనా వంటి దేశాలతో సంబంధాలలో సమతుల్యత పాటిస్తామని తారిఖ్ రెహ్మాన్ గతంలో అన్నారు.

పన్నూ హత్యాయత్నం కేసు- నేరాన్ని అంగీకరించిన భారతీయుడు నిఖిల్ గుప్తా

అమెరికాలో ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు కుట్ర పన్నిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత పౌరుడు నిఖిల్ గుప్తా కోర్టులో తన నేరాన్ని అంగీకరించాడు. మే 29న జడ్జి అతడికి శిక్ష విధించనున్నారు. అయితే కొన్ని నివేదికల్లో మాత్రం 24 ఏళ్లు జైలు శిక్ష విధించినట్లుగా వార్తలు వస్తున్నాయి. నిషేధిత ‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌’ వ్యవస్థాపకుల్లో గురుపత్వంత్‌ సింగ్ పన్నూ ఒకడు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద భారత ప్రభుత్వం అతడిని 2020లో […]

బంగ్లాదేశ్ ఎన్నికల్లో హిందూ నేత గెలుపు

బంగ్లాదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో హిందూ నేత విజయం సాధించారు. ఆ దేశ రాజధాని డాకాలో విజయఢంకా మోగించారు.బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై వరుస దాడులు, హత్య ఉదంతాలు వెలుగుచూస్తున్న వేళ  దేశ రాజధాని ఢాకాలోని కీలకమైన ఢాకా-3 నియోజకవర్గం నుంచిబంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) అభ్యర్థిగా పోటీ చేసిన గాయేశ్వర్ చంద్ర రాయ్ అనూహ్య విజయాన్ని అందుకున్నారు. జమాత్-ఏ-ఇస్లామీ అభ్యర్థి మహమ్మద్ షాహినూర్ ఇస్లాంపై ఆయన గెలుపొందారు.

బంగ్లాదేశ్ ఎన్నికల్లో BNP జోరు- మెజారిటీ మార్క్ దాటిన తారిఖ్ రహ్మాన్ పార్టీ

బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న వేళ బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎన్‌పీ) కూటమి భారీ ఆధిక్యంతో ముందంజలో నిలిచింది. ఇప్పటివరకు వెలువడిన అనధికారిక ఫలితాల ప్రకారం బీఎన్‌పీ నేతృత్వంలోని కూటమి 212 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తూ ప్రభుత్వం ఏర్పాటు దిశగా దూసుకెళ్తోంది. ఈసారి ఎన్నికల్లో బీఎన్‌పీ ఛైర్మన్ తారిఖ్ రహ్మాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మాజీ ప్రధాని ఖాలిదా జియా కుమారుడైన ఆయన పోటీ చేసిన స్థానాల్లో ఘన విజయం సాధించినట్లు అనధికారిక సమాచారం.

వాట్సాప్‌కు రష్యా షాక్..

ప్రముఖ మేసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌కు రష్యా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. దానిని బ్లాక్ చేసింది, తద్వారా ప్రజలకు అందుబాటులో లేకుండా చేసింది. తమ దేశ చట్టాలకు వాట్సాప్ కట్టుబడి ఉండేందుకు విముఖత చూపడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వాట్సాప్ స్థానంలో మ్యాక్స్ అనే మేసేజింగ్ యాప్‌ను రష్యా తీసుకురానుంది. ‘మా యాప్‌ను పూర్తిగా బ్లాక్ చేసేందుకు రష్యా ప్రయత్నించింది. 100 మిలియన్‌ల మంది యూజర్లను భద్రతమైన మేసేజింగ్ వ్యవస్థకు దూరం చేయడం తిరోగమన చర్య. అని […]

హంతకుడు యూనస్ హయాంలో బూటకపు ఎన్నికలు.. వెంటనే రద్దు చేయాలి.

హంతకుడు ముహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్‌లో బూటకపు ఎన్నికలు జరిగాయని మాజీ ప్రధాని షేక్ హసీనా మండిపడ్డారు. ఫాసిస్ట్ యూనస్ హయంలో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికలను తక్షణమే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. గురువారం పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఎన్నికలను ఖండిస్తూ హసీనా ప్రకటన విడుదల చేశారు. అప్రజాస్వామిక పద్ధతిలో ఎన్నికలు జరిగాయని బంగ్లాదేశ్‌లో ఓటర్లు పాల్గొనకుండా, చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగిన ఎన్నికలను రద్దు చేయాలి. యూనస్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ […]

కెనడా కాల్పుల ఘటనలో నిందితురాలు ట్రాన్స్‌జెండర్.. తల్లిని, సోదరుడిని కూడా కాల్చి చంపిన యువతి

కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని టంబ్లర్ రిడ్జ్  స్కూల్‌ కాల్పుల ఘటనలో నిందితురాలు అక్కడే ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఈ కాల్పులకు పాల్పడింది 18 ఏళ్ల ట్రాన్స్ ఉమన్ అయిన జెస్సె వాన్ రూట్‌సీలర్‌గా గుర్తించారు. చదువుకున్న స్కూల్‌లోనే కాల్పులు జరిపింది. స్కూల్‌లోకి రావడానికి ముందు వారి ఇంటిలో తన తల్లి ని,  సవతి సోదరుడి (11)ని కూడా కాల్చి చంపినట్లు గుర్తించారు. మగవాడిగానే జన్మించిన జెస్సె ట్రాన్స్‌ ఉమన్‌గా మారింది. జెస్సె చాలా కాలంగా మానసిక సమస్యలతో […]

బంగ్లాదేశ్ ఎన్నికల్లో హింస.. 18 మంది మృతి?

బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్నాయి. 299 స్థానాల కోసం నేడు ప్రారంభమైన పోలింగ్‌లో మున్షీగంజ్, గోపాల్‌గంజ్ వంటి ప్రాంతాల్లో దుండగులు ముడి బాంబులు పేల్చి హింస చెలరేగేలా చేశారు. ఖుల్నా-2లో బీఎన్‌పీ నేతలకు, జమాత్-ఏ-ఇస్లామీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. రాజధాని ఢాకాలో కూడా అల్లర్లు, భాష్పవాయువు వినియోగం జరిగింది. ఇప్పటివరకు 18 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు.

వేగంగా ఏఐ విస్తరణ వేళ..ఆంథ్రోపిక్‌ సీఈవో సంచలన వ్యాఖ్యలు

ఒక సీఈవో చేసిన వ్యాఖ్యలు సాఫ్ట్‌వేర్‌ ఫీల్డ్‌ను అతలాకుతలం చేసిపారేస్తున్నాయి. ఆరు నెలలు.. మహా అయితే ఏడాదిలోపు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల అవసరం లేకపోవచ్చు.. అంటూ ఆంథ్రోపిక్‌ సీఈవో డారియో అమోడి చెప్పిన మాటలు ఇప్పుడు టెక్‌ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటి దాకా ప్రోగ్రామర్లకు సహాయం చేసిన ఏఐ టూల్స్‌.. సహకారం అందించడం కాకుండా.. స్వయంగా కోడ్‌ రాసేస్తున్నాయని అతి త్వరలోనే మొత్తం డెవలప్‌మెంట్‌ ప్రాసెస్‌ను ఏఐ హ్యాండిల్‌ చేయగలదని డారియో అమోడి అంచనా వేస్తున్నారు.

బంగ్లాదేశ్‌లో పోలింగ్ ప్రారంభం- హసీనా పార్టీ లేకుండా తొలి ఎన్నిక ఇదే

ఏడాదిన్నరగా రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్‌లో గురువారం 13వ జాతీయ పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభమైంది. మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం 2024 ఆగస్టులో విద్యార్థుల భారీ ఉద్యమంతో కూలిపోయిన తర్వాత ఏర్పడిన తాత్కాలిక పాలనకు ఇవి ముగింపు పలకనున్నాయి. ఈసారి 299 పార్లమెంట్ స్థానాలకు 1,981 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.  బంగ్లాదేశ్ రాజకీయాల్లో ప్రభావం చూపిన ప్రధాన పార్టీ       అవామీ లీగ్‌ లేకుండా ఎన్నికలు జరగడం ఇదే […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON