బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న వేళ బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎన్‌పీ) కూటమి భారీ ఆధిక్యంతో ముందంజలో నిలిచింది. ఇప్పటివరకు వెలువడిన అనధికారిక ఫలితాల ప్రకారం బీఎన్‌పీ నేతృత్వంలోని కూటమి 212 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తూ ప్రభుత్వం ఏర్పాటు దిశగా దూసుకెళ్తోంది. ఈసారి ఎన్నికల్లో బీఎన్‌పీ ఛైర్మన్ తారిఖ్ రహ్మాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మాజీ ప్రధాని ఖాలిదా జియా కుమారుడైన ఆయన పోటీ చేసిన స్థానాల్లో ఘన విజయం సాధించినట్లు అనధికారిక సమాచారం.

