loader

మణిపూర్‌లో మరోసారి చెలరేగిన హింస.. రెండు ఇండ్లు దహనం చేసిన ఆందోళనకారులు

ఆందోళనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. గురువారం ఉఖ్రుల్ జిల్లాలోని, లిటన్ ఏరియాలో ఆందోళనకారులు రెండు ఇండ్లను తగలబెట్టారు. స్థానికంగా ఉన్న సరీఖాంగ్ గ్రామంలో గురువారం ఉదయం ఏడు గంటల సమయంలో ఈ హింసాత్మక ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఒకవైపు కేంద్ర, రాష్ట్ర భద్రతా బలగాలు మోహరించి ఉన్నప్పటికీ కొన్ని చోట్ల ఆందోళనలు ఆగడం లేదు.

రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకునే పీఎం రాహత్.. ప్రారంభించిన ప్రధాని

ప్రధాన మంత్రి నూతన కార్యాలయ భవనం సేవా తీర్థ్‌ను ఇవాళ (శుక్రవారం) ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇక నూతన కార్యాలయంలో తొలి రోజున ప్రధాని ఓ కొత్త సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు. రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సాయం అందించేందుకు పీఎం-రాహత్ పేరిట ఈ పథకాన్ని ప్రకటించారు. ప్రమాద క్షతగాత్రులకు రూ.1.50 లక్షల వరకూ వైద్య చికిత్స అందజేయనున్నారు.

ఏనుగుల దాడి.. ఒక కుటుంబంలోని నలుగురితో సహా ఆరుగురి మృతి

ఏనుగుల మంద గ్రామాల్లో సంచరిస్తున్నది. గత కొన్ని రోజులుగా ఆ ఏనుగులు దాడులు చేస్తూ అలజడి సృష్టిస్తున్నాయి. తాజాగా ఒక కుటుంబంలోని నలుగురితో సహా ఆరుగురు వ్యక్తులను తొక్కి చంపాయి. గురువారం రాత్రి చుర్చు బ్లాక్‌లోని గోండ్వార్ గ్రామంలోకి ఆ ఏనుగులు ప్రవేశించాయి. శుక్రవారం తెల్లవారుజామున ఒక పూరింటిపై దాడి చేశాయి. ఆ ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యుల్లో నలుగురితోపాటు మరో ఇద్దరిని తొక్కి చంపాయి. గాయపడిన చిన్నారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

 బంగ్లాదేశ్ కాబోయే ప్రధానికి పీఎం మోదీ శుభాకాంక్షలు.. ఇద్దరం కలిసి పని చేద్దాం..

బంగ్లాదేశ్ పార్లమెంటరీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన బీఎన్పీ చైర్‌పర్సన్ తారిక్ రెహమాన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. “బంగ్లాదేశ్‌లో పార్లమెంటరీ ఎన్నికల్లో బీఎన్‌పీని అఖండ విజయానికి నడిపించినందుకు తారిక్ రెహమాన్‌ను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ప్రధాని మోదీ తన పోస్ట్‌లో ఇంకా ఇలా రాశారు.. మన దేశాల సంబంధాన్ని బలోపేతం చేయడానికి , మన ఉమ్మడి అభివృద్ధి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి మీతో కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను అని ప్రధాని మోదీ సోషల్ మీడియాలో […]

జనగామ మున్సిపాలిటీపై ఉత్కంఠ.. వార్డుల వారీగా ఫలితాలు

జనగామ మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులు ఉండగా, బీఆర్ఎస్ 13 వార్డుల్లో, కాంగ్రెస్ 12 వార్డుల్లో విజయం సాధించింది. నాలుగు వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందగా, ఒక వార్డులో సీపీఎం అభ్యర్థి విజయం సాధించారు. స్వతంత్రుల మద్దతు కీలకం కావడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మంతనాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో మూడో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఒక్క ఓటుతో గెలుపొందడం విశేషంగా మారింది.

బైక్, ట్రక్కును ఢీకొట్టి ఏడుగురు దుర్మరణం

బెంగళూరు శివార్లలోని హోస్కోట్-దబాస్‌పేట్ జాతీయ రహదారి (NH-648)పై శుక్రవారం తెల్లవారుజామున అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. అతివేగం కారణంగా జరిగిన భీకర చైన్ కొలిజన్ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అతివేగంగా దూసుకొచ్చిన ఒక XUV700 కారు ముందు వెళ్తున్న బైక్‌ను బలంగా ఢీకొట్టింది. అనంతరం కారు నియంత్రణ కోల్పోయి, ఎదురుగా వస్తున్న క్యాంటర్ ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో వెనుక నుండి వస్తున్న మరో కారు కూడా వీటిని ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత […]

వరల్డ్​కప్​లో సంచలనం – ఆసీస్​కు షాకిచ్చిన జింబాబ్వే- 23 పరుగుల తేడాతో విజయం

టీ20 వరల్డ్​కప్​లో సంచలన విజయం నమోదైంది. పటిష్ఠమైన ఆస్ట్రేలియాకు పసికూన జింబాబ్వే షాకిచ్చింది. కొలంబో వేదికగా శుక్రవారం ఆసీస్​తో జరిగిన మ్యాచ్​లో జింబాబ్వే 23 పరుగుల తేడాతో విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. 170 పరుగుల ఛేదనలో ఆసీస్ 19.3 ఓవర్లలో 146 పరుగులకే పరిమితమైంది. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజర్భానీ 4, బ్రాడ్ ఇవాన్స్ 3, మసకజ్దా, ర్యాన్ బ్లర్ తలో వికెట్ దక్కించుకున్నారు.

మ‌హిళ‌ల అకౌంట్ల‌లోకి 5 వేలు బ‌దిలీ.. సీఎం స్టాలిన్ కీల‌క ప్ర‌క‌ట‌న

అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు.. త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం మ‌హిళ‌ల‌కు భారీ న‌జ‌రానా అంద‌జేసింది. రాష్ట్రంలోని సుమారు 1.31 కోట్ల మంది మ‌హిళ‌ల‌కు ఇవాళ 5 వేలు బ‌దిలీ చేసిన‌ట్లు సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు. క‌లైగ‌నార్ మ‌గ‌లిర్ ఉరిమై తోగై స్కీమ్ కింద న‌గ‌దును ట్రాన్స్‌ఫ‌ర్ చేశారు. ఒక్క రోజే రాష్ట్ర ప్ర‌భుత్వం దాదాపు 6550 కోట్లు పంపిణీ చేసింది. కేఎంయూటీ స్కీమ్ మూడు నెల‌లకు చెందిన మూడు వేల‌తో వ‌న్‌టైం స‌మ్మ‌ర్ రిలీఫ్ రెండు వేలు క‌లిపి […]

మధిరలో వార్ వన్ సైడ్.. జయహో భట్టి

21 వార్డుల్లో కాంగ్రెస్ కూటమి విజయం ఒకే ఒక్క వార్డుకు పరిమితమైన బిఆర్ఎస్, సిపిఎం, సిపిఐ కూటమి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిర మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందేనని పట్టుబట్టి ఒకవైపు పార్టీ శ్రేణులను కదిలించారు, పోరాట స్ఫూర్తిని నింపారు. మరోవైపు రాబోయే 50 సంవత్సరాలకు సరిపడా మధిర అభివృద్ధికి చేస్తున్న కృషిని ఓటర్లకు తానే స్వయంగా వివరించి వారి మనసు గెలిచి ఘన విజయం సాధించారు.

క్యాంపు రాజకీయాలు షురూ! – అభ్యర్థులకు ఎస్ఈసీ హెచ్చరికలు జారీ

పురపోరులో క్యాంపు రాజకీయాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లాల ఎన్నికల అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది.  ఈ నెల 16న ఛైర్‌పర్సన్లు, మేయర్ల ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని ఎస్ఈసీ స్పష్టం చేసింది. ఎన్నిక ధ్రువపత్రం స్వయంగా విజేతలకే అందచేయాలని తెలిపింది. ఎన్నికల కోడ్‌కు కట్టుబడి ఉంటామని విజేతలు డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించింది. డిక్లరేషన్ నమూనాను ఎన్నికల అధికారులకు ఎస్‌ఈసీ పంపించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON