అమెరికాలో ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత పౌరుడు నిఖిల్ గుప్తా కోర్టులో తన నేరాన్ని అంగీకరించాడు. మే 29న జడ్జి అతడికి శిక్ష విధించనున్నారు. అయితే కొన్ని నివేదికల్లో మాత్రం 24 ఏళ్లు జైలు శిక్ష విధించినట్లుగా వార్తలు వస్తున్నాయి. నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ వ్యవస్థాపకుల్లో గురుపత్వంత్ సింగ్ పన్నూ ఒకడు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద భారత ప్రభుత్వం అతడిని 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది.

