loader

నవల్నీకి విషమిచ్చి చంపారు.. పుతిన్ ప్రభుత్వంపై యూరప్ విమర్శ

రష్యాలో ప్రముఖ ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్నీని విషమిచ్చి చంపేశారని ఐదు యూరోపియన్ దేశాలు పేర్కొన్నాయి. ఆయనకు అత్యంత ప్రమాదకర ప్రాణాంతక టాక్సిన్ శరీరంలోకి పంపించారని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రులు ఆరోపించారు. నవన్లీ మృతదేహం అవశేషాల నమూనాలను విశ్లేషించగా ఆయనకు దక్షిణ అమెరికాలో దొరికే టాక్సిన్ ఎక్కించినట్లు వెల్లడైందని,ఈ దారుణ చర్యకు దిగింది రష్యా ప్రభుత్వమే అని ఈ నేతలు తమ ప్రకటనలో తెలిపారు.

కొత్తగూడెంపై వీడిన ఉత్కంఠ… సిపిఐకి మేయర్ పదవి

కొత్తగూడెం కార్పొరేషన్‌పై ఉత్కంఠకు తెరపడింది. మేయర్ పదవి సిపిఐకి వరించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సిపిఐ నేతలు శనివారం కలిసి చర్చించారు. సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడి, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటి నర్సింహా ముఖ్యమంత్రిని కలిసి ఈ విషయమై చర్చించారు. మేయర్ పదవి సిపిఐకి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించినట్లు తెలిసింది. కాంగ్రెస్‌కు డిప్యూటీ మేయర్ పదవి ఖరారయ్యింది. మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని విధంగా కొత్తగూడెం కార్పొరేషన్‌లో అత్యధిక వార్డుల్లో సిపిఐ విజయం […]

తొలి ప్రాధాన్యం బంగ్లాదేశ్ ప్రయోజనాలకే

బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) ఛైర్మన్ తారిఖ్ రెహ్మాన్ తొలి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు. ఇప్పుడు మనమంతా స్వేచ్ఛను పొందామని, హక్కులకు అసలైన అర్థాన్ని తిరిగి సంపాదించుకున్నామని ఆయన పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యం కోసం పోరాడిన వారందరికీ ఈ విజయన్ని అంకితమిస్తున్నామని అన్నారు.కాగా, భారత్, చైనా వంటి దేశాలతో సంబంధాలలో సమతుల్యత పాటిస్తామని తారిఖ్ రెహ్మాన్ గతంలో అన్నారు.

కెటిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరిన బెల్లంపల్లి కౌన్సిలర్లు

బెల్లంపల్లి మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. శనివారం బెల్లంపల్లికి చెందిన పలువురు కౌన్సిలర్లు బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరారు. పార్టీలో చేరిన వారికి కెటిఆర్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 30వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ శంకర్ సింగ్‌తో పాటు, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన 26వ వార్డు కౌన్సిలర్ కుమారస్వామి బిఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకున్నారు. వీరితో పాటు బిజెపికి చెందిన 34వ వార్డు అభ్యర్థి […]

ప్రియురాలితో బ్రేకప్‌.. వాలంటైన్స్‌ డే రోజున యువకుడు ఆత్మహత్య

ప్రియురాలు బ్రేకప్‌ చెప్పడంతో ప్రియుడు మనస్థాపం చెందాడు. ప్రేమికుల దినోత్సవం రోజున రూమ్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ప్రియురాలు, ఆమె స్నేహితుడు కలిసి అతడ్ని హత్య చేసినట్లు యువకుడి కుటుంబం ఆరోపించింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఈ సంఘటన జరిగింది. 17 ఏళ్ల అమన్ గిరి ఇంటర్‌ చదువుతున్నాడు. ఎన్డీఏ పరీక్ష కోసం కోచింగ్‌ తీసుకుంటున్నాడు. ఎన్డీయే కోచింగ్‌కు వస్తున్న యువతి అతడికి పరిచయమైంది. దీంతో ఎనిమిది నెలలుగా వారిద్దరూ ప్రేమలో ఉన్నారు.

కార్గో లారీని ఢీకొట్టిన కారు.. మహిళతో సహా ఐదుగురు మృతి

కార్గో లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ కారులోని మహిళతో సహా ఐదుగురు మరణించారు. కారు డ్రైవర్‌ నిద్రలో జోగడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌కు చెందిన ఒక కుటుంబం తీర్థయాత్ర కోసం కారులో బయలుదేరింది. ఫిబ్రవరి 13న ఉజ్జయినీలోని మహాకాళేశ్వర్ ఆలయాన్ని వారు దర్శించారు. ఆ తర్వాత రాజస్థాన్‌లోని ఖాతు శ్యామ్ జీ ఆలయానికి కారులో ప్రయాణమయ్యారు.

బంగాళాఖాతంలో ఒకటి కాదు రెండు అల్పపీడనాలు.. 

ప్రస్తుతం చలికాలం ముగిసి వేసవిలోకి అడుగుపెడుతున్న సమయంలో మళ్లీ వర్షసూచనలు వెలువడ్డాయి. ఈ నెలలోనే ఒకటి కాదు రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలున్నాయని… వీటి ప్రభావంతో వీటి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణాది రాష్ట్రాలతో పాటు శ్రీలంకపై ఈ అల్పపీడనాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. బంగాళాఖాతంలో ప్రస్తుతం అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది.

ప్రేమికుల దినోత్సవం రోజున విషాదం.. కారులో కాల్పులు, జంట మృతి

 ప్రేమికుల దినోత్సవం రోజు విషాదం జరిగింది. కారులో ఉన్న యువ జంట తుపాకీ కాల్పుల్లో మరణించారు.  15 ఏళ్లుగా వారిద్దరూ ప్రేమలో ఉన్నారు. అయితే ప్రియురాలు     మరో వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రియుడు ఒక నోట్‌లో పేర్కొన్నాడు. శనివారం ఉదయం నోయిడా సెక్టార్ 39 సమీపంలో ఆగి ఉన్న కారు నుంచి కాల్పుల శబ్దం వినిపించింది. భయాందోళన చెందిన స్థానికులు ఆ కారు వద్దకు వెళ్లి పరిశీలించారు. కారు లోపల ఉన్న యువ జంట బుల్లెట్‌ గాయాలతో మరణించినట్లు […]

రైతు సంఘాల నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. అమెరికాతో వాణిజ్య ఒప్పందాలపై చర్చ

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పలు రైతు సంఘాల నేతలను కలిశారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన ఆయన పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో రైతు నేతలతో భేటీ అయ్యారు. భారత్‌, అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాలపై చర్చించారు.  భారత్‌, అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాలపై రైతు సంఘాల నేతలతో రాహుల్‌ గాంధీ చర్చించారు.  రైతుల ప్రయోజనాలు కాపాడటంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని రాహుల్‌ గాంధీ ఆరోపించారు.

సీఎం చంద్రబాబును కలిసిన మహిళా ప్రజాప్రతినిధులు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. రేపటి మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని, కూటమి ప్రభుత్వానికి చెందిన మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు శివతత్వానికి ప్రతీకగా ఉన్న చీరలను ధరించి సభకు హాజరయ్యారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం వీరంతా ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON