ప్రేమికుల దినోత్సవం రోజు విషాదం జరిగింది. కారులో ఉన్న యువ జంట తుపాకీ కాల్పుల్లో మరణించారు. 15 ఏళ్లుగా వారిద్దరూ ప్రేమలో ఉన్నారు. అయితే ప్రియురాలు మరో వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రియుడు ఒక నోట్‌లో పేర్కొన్నాడు. శనివారం ఉదయం నోయిడా సెక్టార్ 39 సమీపంలో ఆగి ఉన్న కారు నుంచి కాల్పుల శబ్దం వినిపించింది. భయాందోళన చెందిన స్థానికులు ఆ కారు వద్దకు వెళ్లి పరిశీలించారు. కారు లోపల ఉన్న యువ జంట బుల్లెట్ గాయాలతో మరణించినట్లు గమనించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.

