బంగ్లాదేశ్లో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్నాయి. 299 స్థానాల కోసం నేడు ప్రారంభమైన పోలింగ్లో మున్షీగంజ్, గోపాల్గంజ్ వంటి ప్రాంతాల్లో దుండగులు ముడి బాంబులు పేల్చి హింస చెలరేగేలా చేశారు. ఖుల్నా-2లో బీఎన్పీ నేతలకు, జమాత్-ఏ-ఇస్లామీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. రాజధాని ఢాకాలో కూడా అల్లర్లు, భాష్పవాయువు వినియోగం జరిగింది. ఇప్పటివరకు 18 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు.

