45 రోజుల్లోగా ఖర్చుల వివరాలు ఇవ్వాల్సిందే!
తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రచారంలో ఉపయోగించే 63 అంశాలతో ప్రతిదానికో ధరను నిర్ణయించారు. వాటి సైజు, విస్తీర్ణం ప్రకారంగా రేట్లను నిర్ణయించారు. ఒక్కో అభ్యర్థి మున్సిపాలిటీలో రూ. లక్ష, కార్పొరేషన్లలో రూ.1.5 లక్షల్లోపు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల్లో అభ్యర్థులు గెలిచినా, ఓడినా ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి 45 రోజుల్లో పూర్తిస్థాయిలో ఖర్చు వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. లేదంటే గెలుపొందిన అభ్యర్థి ఎన్నికను రద్దు చేస్తారు. ఓడిన అభ్యర్థులు మూడేళ్ల పాటు ఎలాంటి ఎన్నికల్లోనైనా […]

