రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ విమర్శించారు. 420 హామీలు ఇచ్చి ఒక్క హామీని అమలు చేయకుండా మోసం చేశారని మండిపడ్డారు. మెదక్ రావాలంటే రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందని హరీశ్‌రావు అన్నారు. అన్ని జిల్లాలు తిరుగుతున్న రేవంత్ రెడ్డి ఉమ్మడి మెదక్‌కు వచ్చేందుకు ముఖం లేదని విమర్శించారు.ఇక్కడ హరీశ్‌రావు ఉన్నాడని భయపడుతున్నాడని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, గ్యారంటీలు, గారడీలపై మెదక్ ప్రజలు నిలదీస్తారని ఇటువైపు చూడటం లేదని పేర్కొన్నారు.

