loader

క్లోజ్‌ ఫ్రెండ్స్‌.. వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్‌!

యాప్‌ వాట్సాప్ కొత్త ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్ క్లోజ్ ఫ్రెండ్స్ లాగా కనిపిస్తుంది మీరు ప్రతిసారీ స్టేటస్ పోస్ట్ చేసేటప్పుడు మీ ప్రైవసీ సెట్టింగ్స్‌లో మార్పులు చేసే బదులుగా, మీరు ముందుగానే సన్నిహిత స్నేహితుల జాబితాను సృష్టించవచ్చు. అప్పుడు మీరు వారితో ఏదైనా పంచుకోవాలనుకున్నప్పుడు, మీరు ఆ జాబితాను ఎంచుకుంటారు. మీరు క్లోజ్ ఫ్రెండ్స్ స్టేటస్ పోస్ట్ చేసినప్పుడు మీ ప్రొఫైల్ పిక్చర్ చుట్టూ రంగు రింగ్ ఉండటం కూడా తేడాను కలిగిస్తుంది. ఆండ్రాయిడ్  వాట్సాప్ బీటాలో క్లోజ్ […]

ముంబైలో చిరుత కలకలం

ముంబై ప్రాంతంలో చిరుత సంచారం స్థానికంగా కలకలం సృష్టించింది. టీవీ9 నివేదికల ప్రకారం, ముంబై నగరంలో ఒక చిరుత కనిపించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ ఘటన ప్రజలలో కొంత ఆందోళనను, అదే సమయంలో ఆసక్తిని రేకెత్తించింది. సాధారణంగా జనావాసాలకు దూరంగా ఉండే చిరుతపులి, నగర పరిధిలో కనిపించడం అరుదైన సంఘటనగా భావిస్తున్నారు. ముంబైలో చిరుత ఉనికి గురించి వార్తలు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. స్థానిక అధికారులు ఈ విషయంపై అప్రమత్తంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని […]

బర్డ్ ఫ్లూ తో 28 వేల కోళ్లు మృతి

ఆంధ్రప్రదేశ్‌ (AP) లో బర్డ్ ఫ్లూ వైరస్ మరోసారి పంజా విసురుతోంది. చిత్తూరు జిల్లా సదుం మండలంలో ఈ వ్యాధి తీవ్రత పెరుగుతుండటంతో యంత్రాంగం అప్రమత్తమైంది. గత వారం రోజులుగా మండలంలోని పుట్టవారి పల్లి, అమ్మగారిపల్లి, కంభంవారి పల్లి గ్రామాల్లో ఉన్న కోళ్ల ఫారాల్లో పెద్ద సంఖ్యలో కోళ్లు అకస్మాత్తుగా మృతి చెందుతున్నాయి.స్థానిక పశుసంవర్ధక శాఖ అధికారులు చేపట్టిన ప్రాథమిక పరీక్షల్లో వీటికి బర్డ్ ఫ్లూ వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో యంత్రాంగం అప్రమత్తమైంది.

మేడారం జాతర హుండీ లెక్కింపు…రూ. 10 కోట్లు దాటిన ఆదాయం, ఇంకా హుండీలు

మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర మొత్తం 828 హుండీలలో 615 హుండీల లెక్కింపు పూర్తి అయింది. ఇప్పటివరకు రూ. 10 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. తొలి రోజు 125 హుండీలను తెరవగా రూ. 2,49,65,000 ఆదాయం వచ్చింది.  రెండో రోజు 160 హుండీలను తెరవగా రూ. 3,54,25,200 ఆదాయం వచ్చినట్టుగా లెక్కించారు. మూడో రోజైన శనివారం 140 హుండీలు తెరవగా.. రూ.2,01, 21, 440 ఆదాయం లభించింది. 4వ రోజైన ఆదివారం నాడు 200 […]

ఫ్లైఓవర్‌పై ఆగి ఉన్న కారు.. అందులో మూడు మృతదేహాలు

దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పీరాగఢి ఫ్లైఓవర్‌ వద్ద పార్క్ చేసి ఉన్న ఒక కారులో మూడు మృతదేహాలు లభ్యమవ్వడం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఒకే కారులో ముగ్గురు వ్యక్తులు విగతజీవులుగా పడి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నట్లు పోలీస్‌ అధికారి తెలిపారు.  ఇది హత్యా? లేక కారులో ఏవైనా విషవాయువులు లీక్ అయి జరిగిన ప్రమాదమా? అనే కోణంలో […]

మహిళను కర్రతో కొట్టి కాళ్లతో తన్నిన బీజేపీ నేత..

బీజేపీ నేత ఒక మహిళను దారుణంగా కొట్టాడు. కర్రతో చితకబాదాడు. కాళ్లతో ఆమెను తన్నాడు. ఆ మహిళ వీపుపై పిడిగుద్దులు కురిపించాడు. ఈ నేపథ్యంలో ఆ బీజేపీ నేత తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అయితే ఆ మహిళను ఎందుకు అలా కొట్టాడో అన్నది తెలియలేదు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ  అధ్యక్షుడు జీతూ పట్వారీ ఈ వీడియో […]

మార్చి 31కల్లా నక్సలిజం అంతం.. స్పష్టం చేసిన హోంమంత్రి అమిత్ షా

దేశంలో వచ్చే మార్చి 31లోపు నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. మావోయిస్టుల ఏరివేత అంశంపై ఛత్తీస్‌ఘడ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఆదివారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమవేశంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 31లోపు నక్సలిజాన్ని పూర్తిగా తుడిచివేస్తామన్నారు. వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. , భద్రతా దళాల ఆపరేషన్స్, మౌలిక వసతుల కల్పన వంటి […]

దేవరపల్లి ఆశ్రమ బాలుర హాస్టల్ విద్యార్ధుల అస్వస్థతపై సీఎం సీరియస్

ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం జిల్లా మారేడుమిల్లి మండలం దేవరపల్లి గిరిజన ఆశ్రమ బాలుర వసతి గృహంలో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులతో ఇవాళ అమరావతిలో సమీక్ష నిర్వహించారు ‘హాస్టళ్లలో విద్యార్థులకు ఏమైనా జరిగితే ముందుగా సంబంధిత అధికారులను సస్పెండ్ చేసి, తర్వాతే మిగతా విషయాలు చర్చిస్తాను’ అని ఆయన హెచ్చరించారు. రేపటిలోగా (ఫిబ్రవరి 9) సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

ఆరెస్సెస్ శతాబ్ది ఉత్సవాలు.. సల్మాన్, అక్షయ్, రణబీర్ సహా బాలీవుడ్ స్టార్స్ హాజరు

రాష్ట్రీయ స్వయం స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) శతాబ్ది ఉత్సవాలు ముంబైలో జరుగుతున్నాయి. రెండు రోజులపాటు నిర్వహించిన ఈ వేడుకలకు ముంబైలోని బాలీవుడ్ స్టార్స్ హాజరయ్యారు. సూపర్ స్టార్స్ సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ వంటి బాలీవుడ్ స్టార్స్ హాజరవ్వడం ప్రత్యేకంగా నిలిచింది. ముంబై, వర్లీలోని నెహ్రూ సెంటర్లో నిర్వహించిన వేడుకలకు హాజరైన బాలీవుడ్ స్టార్స్ ఆరెస్సెస్ నేతలతో కలిసి చర్చిస్తూ కనిపించారు. శని, ఆదివారాల్లో జరిగిన వేడుకలకు బాలీవుడ్ మొత్తం హాజరైనట్లు […]

బుడ్డ బిల్డింగ్‌లో మంటలు ఆర్పేందుకు మూడు గంటలు పట్టిందా.. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ అగ్ని ప్రమాదంపై కేటీఆర్‌

ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ అగ్ని ప్రమాదం వెనుక కుట్ర ఉందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అనుమానం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డినే ల్యాబ్‌ను తగులబెట్టించాడని ప్రజలంతా భావిస్తున్నారని తెలిపారు. ఆధారాలు నాశనం చేసి కేసు నుంచి బయటపడాలని రేవంత్‌ రెడ్డి స్వయంగా కుట్ర పన్ని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో ఆధారాలు లేపేసిండని విమర్శించారు. ఉదయం 10 గంటలకు అగ్ని ప్రమాదం జరిగితే మధ్యాహ్నం 3 గంటల దాకా మంటలు అదుపు చేయలేదని.. బుడ్డ బిల్డింగ్‌లో మంటలు ఆర్పడానికి […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON