తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 11న జరగబోతోంది. దానికి ముందు రోజు నారాయణపేట జిల్లా.. మక్తల్ మున్సిపాలిటీలో 6వ వార్డు అంటే.. చందాపూర్ గ్రామంలో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఎరుకలి మహాదేవ్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గిరిజన సామాజిక వర్గానికి చెందినవాడు. ది ఆత్మహత్య కాదనీ.. ఒక రకమైన హత్య అని మహాదేవ్ భార్య సత్తెమ్మ, కుటుంబ సభ్యులు, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు, ఆ పార్టీకి చెందిన ప్రత్యర్థుల వేధింపులు, బెదిరింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు.

